తెలుగులో నెంబర్ దర్శకుడు రాజమౌళి, యంగ్ డైరక్టర్స్ సుజీత్, నాగ్ అశ్విన్ లతో పనిచేసిన తర్వాత, ప్రస్తుతం ప్రభాస్, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి చెప్పిన ఓ స్టోరీ లైన్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా రిషబ్ శెట్టి ఈ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నారు. 'KGF' మరియు 'కాంతారా' వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌ల వెనుక నిలబడిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అందులో భాగంగా ప్రభాస్ స్టార్ ఇమేజ్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లే స్క్రిప్ట్‌ని లాక్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగా నటుడు , దర్శకుడు రిషబ్ శెట్టిని ఓ ఎట్రాక్టివ్ స్క్రిప్ట్‌ను అందించమని కోరారు. అతను ఒక స్క్రిప్ట్ అందిస్తానని హామీ ఇచ్చాడు, కానీ అతను దర్శకత్వం వహించరని తెలుస్తోంది.