`కల్కి2898ఏడీ`పై నాగ్‌ అశ్విన్‌ నష్ట నివారణ చర్యలు .. `పాతాళభైరవి` టూ `స్టార్‌ వార్స్`... ఈ కథ ఎలా పుట్టిందంటే

First Published Jun 18, 2024, 5:16 PM IST

`కల్కి 2898ఏడీ` సినిమాపై బజ్‌ లేదు, జనాలకు ఎక్కడం లేదు. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. తాజాగా ఓ వీడియో విడుదల చేసి వివరించాడు. ఏం చెప్పాడంటే..
 

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మదిలో నుంచి పుట్టిన క్రియేటివ్‌ ఇమాజినేషన్‌కి ప్రతిరూపమే `కల్కి 2898 ఏడీ` మూవీ. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రమిది. మైథలాజికల్‌ అంశాలకు, సైన్స్ ఫిక్షన్‌ని జోడించి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో `కల్కి` సినిమాని రూపొందిస్తున్నారు నాగ్‌ అశ్విన్‌. విష్ణువు పదో అవతారం కల్కి టైమ్‌లో ఈ ప్రపంచం ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? అనే అంశాలను ఈ సినిమా ద్వారా ఊహాత్మకంగా చూపించబోతున్నాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. 

తాజాగా ఈ సినిమా కథ ఎలా పుట్టిందనేది వివరించారు. `కల్కి` యానిమేషన్‌ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎపిసోడ్‌ 1 ప్రీలాడ్‌ పేరుతో నాగ్‌ అశ్విన్‌ ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో అసలు `కల్కి` కథ ఎలా పుట్టింది, ఆ కథ రాయడానికి ఎన్నేళ్లు పట్టిందనేది వివరించాడు నాగ్‌ అశ్విన్‌. 
 

Latest Videos


ఇందులో మాట్లాడుతూ, `చిన్నప్పట్నుంచి పౌరాణిక చిత్రాలను చూస్తూ వచ్చాం. అందులో నా ఫేవరేట్‌ మూవీ `పాతాళ భైరవి`. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఏదో డిఫరెంట్‌గా చేస్తూ వచ్చారు. `భైరవ ద్వీపం` కావచ్చు, `ఆదిత్య 369` కావచ్చు, కొన్ని హాలీవుడ్‌ చిత్రాలు `స్టార్‌ వార్స్` చూసినప్పుడు కూడా అవి చాలా బాగున్నాయి. కానీ మన స్టోరీలు కావు. అవన్నీ వెస్ట్ లో జరుగుతుంటాయి. మన స్టోరీలు ఎందుకు చెప్పకూడదనే ఆలోచనతో మహాభారతంలో రాసిన లాస్ట్ బ్యాటిల్‌.. విష్ణు చివరి అవతారం కృష్ణ అవతారంతో ఎండ్‌ అవుతుంది. 
 

అక్కడ్నుంచి కలియుగం ఎంటరైనప్పుడు ఈ కథ ఎలా వెళ్తుందనేది పూర్తిగా ఊహాత్మకమైనది. క్రియేటివ్‌ ఇమాజినేషన్‌. కృష్ణుడి అవతారం తర్వాత దశావతారం కల్కి ఇప్పుడు మన కళియుగంలో ఎలా జరగబోతుంది. ఎలా జరగొచ్చు అనేదానిపై ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎవ్వరైనా రిలేట్‌ అయ్యేలా చేస్తే ఎలా ఉంటుందనేదానిపై ఈ కథ రాసుకున్నాను. నిజానికి ఇది అన్నింటికి క్లైమాక్స్. పురాణాల్లో మనం చదివిన ఎపిక్స్ కి అన్నింటికి ఇదొక క్లైమాక్స్ లాగా చేస్తే, కలి అనేవాడు ఒక్కో టైమ్‌లో ఒక్కో రూపంలో ఉంటాడనుకుంటే. రావణుడిలా ఒకసారి, దుర్యోధనుడిలా మరోసారి, ఇప్పుడు కళియుగంలో అల్టిమేట్‌ ఫైనల్‌ రూపం తీసుకుంటే. అతను ఎలా ఉంటాడు, ఎలా హీరో అవుతాడు. చీకటి, వెలుగు అనేది పెట్టుకుని రాసుకుంటే ఇది రాయడానికి ఐదేళ్లు పట్టింది. ఇలాంటి ఓ కొత్త సైన్స్ ఫిక్షన్‌ చిత్రాన్ని చూస్తే జనాలు ఎలా క్యూరియస్‌ అవుతారనేది ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది` అని వెల్లడించారు నాగ్‌ అశ్విన్‌. 

`కల్కి` సినిమా పుట్టడానికి మూలం ఏంటో తెలిపే ప్రయత్నం చేశారు. ఇలా వరుసగా ఒక్కో ఎపిసోడ్‌ లాగా `కల్కి` కథలోని ప్రధాన అంశాలను జనాలకు అర్థమయ్యేలా చెప్పబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా ఏంటనేది చాలా వరకు అర్థం కావడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నెగటివ్‌ ప్రచారం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కథని ఆడియెన్స్ కి రిలేట్‌ చేసే పనిలో పడ్డాడు నాగ్‌ అశ్విన్‌. ఓ రకంగా నష్టనివారణ చర్యలు చేపడుతున్నాడు. సినిమాపై ఏం చేసినా హైప్‌ రాని నేపథ్యంలో డైరెక్ట్‌ గా తనే రంగంలోకి దిగాడు, `కల్కి` కథ పుర్వపరాలు చెబుతూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇది ఎంత వరకు జనంలోకి వెళ్తుంది, ఎంతటి బజ్‌ని జనరేట్‌ చేస్తుందనేది చూడాలి. 

`కల్కి` టీజర్‌, ట్రైలర్స్, యానిమేషన్‌ వీడియోల ప్రకారం విష్ణువు పదో అవతారం కల్కి. ఆయనకు దీపికా పదుకొనె జన్మనిస్తుంది. అశ్వత్థామ అతన్ని కాపాడుతూ వస్తుంటాడు. ట్రైలర్లో, అశ్వత్థామ గ్లింప్స్ లో చూపించిన చిన్న పిల్లాడే కల్కి అని తెలుస్తుంది. అయితే దీపికా పదుకొనెనే పట్టుకొస్తే భైరవ పాత్రలో ఉన్న ప్రభాస్‌కి కొన్ని యూనిట్లు వస్తాయి. వాటి ద్వారా కాంప్లెక్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకోసం వెళ్లగా, అశ్వత్థామతో గొడవ అవుతుంది. ఈ ఫైట్‌లో వీరి గురించి భైరవకి తెలుస్తుందని, కల్కిని కాపాడే బాధ్యత భైరవ తీసుకుంటాడని తెలుస్తుంది. మరి ఆ కల్కి ఎవరు? ప్రభాసే ఆ కల్కిగా ఉంటాడా? ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది పెద్ద సస్పెన్స్. మరి కలిగా కమల్‌ హాసన్‌ కనిపిస్తారని తెలుస్తుంది. నిజం ఏంటనేది సినిమా చూస్తేగానీ తెలియదు. ఈ నెల 27న సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. 
 

click me!