మొన్న వినాయక్‌, ఇప్పుడు నాగ్ అశ్విన్‌.. `విశ్వంభర`లో ఏం జరుగుతుంది? చిరంజీవి భయానికి కారణమదేనా?

Published : Jan 31, 2025, 08:16 AM IST

చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` సినిమాకి సంబంధించిన సరికొత్త రూమర్‌ షాకిస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది. సినిమాపై ఫ్యాన్స్ లో అయోమయం క్రియేట్‌ చేస్తుంది. ఇంతకి ఏంటది?  

PREV
15
మొన్న వినాయక్‌, ఇప్పుడు నాగ్ అశ్విన్‌.. `విశ్వంభర`లో ఏం జరుగుతుంది? చిరంజీవి భయానికి కారణమదేనా?

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న`విశ్వంభర`మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో వినాయక్‌ ఇన్‌వాల్వ్ అయ్యారనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ ఇన్‌వాల్వ్ అవుతున్నారట. వీఎఫ్‌ఎక్స్ ని లీడ్‌ చేస్తున్నారట. మరి ఇంతకి `విశ్వంభర`లో ఏం జరుగుతుంది? అనేది చూస్తే. 
 

25

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాతో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఆషికా రంగనాథ్‌, ఇషా చావ్లా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. `సైరా నరసింహారెడ్డి` తర్వాత ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీగా దీన్ని రూపొందిస్తున్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` తర్వాత ఆ స్థాయిలో సోషియో ఫాంటసీగా ఈ మూవీని చేస్తున్నారు మెగాస్టార్‌. 
 

35

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేయడంతోపాటు ఫ్యాన్స్ ని కొంత అయోమయానికి గురి చేస్తుంది. వశిష్ట దర్శకుడు కాగా, మూవీలో ఇతర దర్శకులు ఇన్‌వాల్వ్ అవుతున్నారనే వార్త ఆశ్చర్యపరుస్తుంది. గతంలో మాస్‌ డైరెక్టర్ వివి వినాయక్ ఇన్‌వాల్వ్ అవుతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఆయన వీఎఫ్‌ఎక్స్ వర్క్ చూస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. `బింబిసార` వంటి సినిమాని తీసిన వశిష్ట ఉండగా, మరో దర్శకుడి ఇన్‌వాల్వ్ మెంట్‌ ఏంటనే అనుమానాలు కలిగాయి. ఔట్‌పుట్‌ బెటర్‌మెంట్‌ కోసం చిరంజీవి సలహా మేరకు వినాయక్‌ రంగంలోకి దిగినట్టు వార్తలు వచ్చాయి. 
 

45

ఇక ఇప్పుడు మరో దర్శకుడు ఇన్‌వాల్వ్ అవుతున్నారట. `మహానటి`, `కల్కి 2898 ఏడీ` వంటి సినిమాలతో ఆడియెన్స్ ని మాయ చేసిన నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీలో ఇన్‌వాల్వ్ అవుతున్నారట. ఆయన వీఎఫ్‌ఎక్స్ వర్క్ చూస్తున్నారట. సీజీ వర్క్ క్వాలిటీ విషయంలో చిరు తగ్గడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడియెన్స్ అన్నీ గమనిస్తున్నారు. వరల్డ్ క్లాస్‌ మూవీస్‌ని చూస్తున్నారు.

ఈ క్రమంలో నాసిరకమైన సీజీ ఉంటే అది విమర్శలకు తావిస్తుంది. సినిమా ఫలితాన్నే ప్రభావితం చేస్తుంది. దారుణమైన ట్రోల్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చాలా కేర్‌ తీసుకుంటున్నారట. అందుకే నాగ్‌ అశ్విన్‌ని రంగంలోకి దించినట్టు సమాచారం. ఆయన వీఎఫ్‌ఎక్స్ పర్యవేక్షిస్తున్నారని వార్తలు బయటకు వచ్చాయి. 
 

55

అయితే ఇందులో నిజమెంతా అనేది సస్పెన్స్. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని, అందులో నిజం లేదని తెలుస్తుంది. ఏదేమైనా చిరంజీవి మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వీఎఫ్‌ఎక్స్ విషయంలో రాజీపడటం లేదని, ఇప్పటికే ఓ కంపెనీకి ఆ బాధ్యతలు ఇవ్వగా, డిలే అవుతున్నట్టు సమాచారం.

అందుకే రిలీజ్‌ డేట్ ని కూడా ఇంకా కన్ఫమ్‌ చేయలేదు టీమ్. సమ్మర్‌ టార్గెట్‌గా మే 9న విడుదల చేసే అవకాశం ఉంది. అనుకున్న టైమ్‌లోకి వీఎఫ్‌ఎక్స్ వర్క్ కంప్లీట్‌ అయితేనే ఇది సమ్మర్‌కి వస్తుంది, లేదంటే వాయిదా పడే ఛాన్స్ ఉందట. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories