బ్యాక్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఏంజెల్‌ లుక్‌లో నభా మతిపోగొట్టే పోజులు

Published : Nov 14, 2022, 05:25 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్‌ ఘాటురేపే అందాలకు కేరాఫ్‌. బౌండరీలు బ్రేక్‌ చేసి అందాల ప్రదర్శన చేయడంలో ముందే ఉండే ఈ భామ ఇప్పుడు మరింత హాట్‌గా కనువిందు చేస్తుంది. 

PREV
18
బ్యాక్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఏంజెల్‌ లుక్‌లో నభా మతిపోగొట్టే పోజులు

నభా నటేష్‌ లేటెస్ట్ గా ఏంజెల్‌ లుక్‌లో మెరిసిపోతుంది. లైట్‌ బ్లూ గౌన్‌లో హోయలు పోయింది. రాజహంసలాంటి పోజులిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది నభా. ఇందులో ఆమె మరింత హాట్‌గా, సెక్సీగా కనిపిస్తుండటం విశేషం. దీంతో ప్రస్తుతం ఆమె గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

28

నభా నటేష్‌ ఘాటు రేపే అందాలతో మతిపోగొడుతుంది. లుక్‌ ఏంజెల్‌లా ఉన్నా, ఆమె హాట్‌నెస్‌ మాత్రం మరింత పెరగడం విశేషం. దీంతో వోరగా చూసే ఆ చూపులు, ఆ పోజులు మతిపోగొడుతుండటం విశేషం. అభిమానులను పిచ్చెక్కించేలా ఈ ఫోటోలు ఉండటం మరో విశేషం. నిన్నటి సాయంత్రం నుంచి ఈ అమ్మడి రచ్చ సోషల్‌ మీడియాలో మామూలుగా లేదని చెప్పొచ్చు. 

38

నభా నటేష్‌ `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో బిగ్‌ బ్రేక్‌ని అందుకుంది. ఇక నభా నటేష్‌ కెరీర్‌ పరుగులు పెడుతుందని భావించారు. అవకాశాలైతే వచ్చాయి. కానీ ఆమె కెరీర్‌ పరుగులు పెట్టలేకపోయింది. ఒడిదుడుకులతో సాగుతుంది. సక్సెస్‌ లేకపోవడంతో ఒక్కసారిగా వెనకబడిపోయింది నభా నటేష్‌. 

48

నభా నటేష్‌ మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చింది. శివరాజ్‌కుమార్‌ నటించిన `వజ్రకాయ` చిత్రంతో ఆమె హీరోయిన్‌గా వెండితెరకి పరిచయం అయ్యింది. తొలి చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతోపాటు `లీ`, `సహేబా` వంటి సినిమాలతో అలరించింది. ఇక్కడ పేరు రావడంతో తెలుగు మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. 
 

58

తెలుగులో నాలుగేండ్ల క్రితం `నన్ను దోచుకుందువటే` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలో మంచి నటనతో ఆకట్టుకుంది. గ్లామర్‌ పరంగా ఆకర్షించింది. అంతలో దర్శకుడు, నటుడు రవిబాబు ఆమెతో `అదుగో` చిత్రం చేశారు. ఈ సినిమా పరాజయం చెందింది. కానీ అప్పటికే ఆమెకి `ఇస్మార్ట్ శంకర్‌`లో పూరీ ఆఫర్‌ ఇచ్చారు. 

68

రామ్‌ పోతినేని హీరోగా నటించిన `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంలో నిధి అగర్వాల్‌తోపాటు హీరోయిన్‌గా నటించింది. నటనకు నటన, అందానికి అందంతో ఆకట్టుకుంది. గ్లామర్‌ డోస్‌ పెంచి మత్తెక్కించింది. బీచ్‌లో అందాల విందుతో కుర్రాళ్లకి చెమటలు పట్టించిందీ బ్యూటీ. దీంతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ ఏర్పడింది. 

 

78

దీంతో ఆమెకి వరుసగా `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్‌`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని చెప్పుకోదగ్గ విజయాలు కాదు. దీంతో ఈ అమ్మడి క్రేజ్‌ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు ఫోటో షూట్లకి పని పెట్టింది నభా. వరుసగా తన అందాలు ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తూనే, మరో వైపు మేకర్స్‌ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. 

88

ఇంటర్నెట్‌లో ఫాలోయింగ్‌ని దృష్టిలో పెట్టుకుని గ్లామర్‌ పోతకి దిగుతుంది నభా నటేష్‌. వరుసగా హాట్‌ ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తుంది. నెటిజన్లని ఆకర్షిస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ పోతుంది. అయితే ఇటీవల కాస్త గ్యాప్‌ ఇస్తుంది. ఇప్పుడిప్పుడే మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ అందాల ప్రదర్శనకైనా ఆఫర్లు వస్తాయా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories