‘యశోద’ సాలిడ్ కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాకే!

Published : Nov 14, 2022, 05:12 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన చిత్రం ‘యశోద’ (Yashoda). సక్సెస్ ఫుల్ థియేట్రికల్ తో దూసుకుపోతున్న ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది.  ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ షాకింగ్ గా ఉన్నాయి.   

PREV
16
‘యశోద’ సాలిడ్ కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే షాకే!

స్టార్ హీరోయిన్ సమంత ‘యశోద’ చిత్రంతో ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 11న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా  స్థాయిలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
 

26

మరోవైపు ఈ సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా కథ విభిన్నంగా ఉండటం..  దానికి స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ తోడవడంతో సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ ‘యశోద’ వసూళ్లు షాకింగ్ గా ఉన్నాయి.
 

36

తాజా సమాచారం ప్రకారం.. మూడు రోజుల్లో సమంత నటించిన ‘యశోద’ చిత్రం దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు దగ్గరికి వచ్చినట్టు తెలుస్తోంది.  కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్ల మేర వసూల్ చేసినట్టు తెలుస్తోంది. 

46

తొలిరోజు రూ. 6 కోట్ల గ్రాస్ రాగా.. రూ. 3 కోట్ల మేర షేర్ వసూల్ చేసింది.  రెండోరోజు ఆ కలెక్షన్లు  రూ. 12 కోట్ల గ్రాస్ కు చేరుకోగా.. రూ.5.76 మేర షేర్ రాబట్టింది. ఇక మూడో రోజు రూ.17.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. రూ.8.37 కోట్ల షేర్ వసూల్ చేసి అదరగొడుతోంది. 
 

56

కేవలం మూడురోజుల్లోనే ‘యశోద’ చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం విశేషం. రూ.22 కోట్ల మేర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండటంతో.. ప్రస్తుతం కలెక్ట్ చేసిన దానికి మరో రూ.3.63 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈరోజటి కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి కానుందని అంటున్నారు. 

66

ఓవర్సీస్ లోనూ గట్టిగానే వసూళ్లు రాబడుతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. హాఫ్ మిలియన్ డాలర్లు వసూల్ చేసి అదరగొడుతోంది. మున్ముందు సాలిడ్ కలెక్షన్లతో దుమ్ములేపనుందని అంచనా వేస్తున్నారు.  ఈ మహిళా-కేంద్రీకృతమైన సైన్స్ ఫిక్షన్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్ కు హరి-హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. 
 

click me!

Recommended Stories