Mouni Roy Wedding: ఘనంగా 'నాగిని' భామ మౌనీరాయ్ వివాహం.. పెళ్లిలోనే ఇబ్బంది పెట్టాడుగా, వైరల్ ఫోటోస్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 06:55 PM IST

వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ తో చాలా కాలంగా మౌనీ రాయ్ ప్రేమలో ఉంది. ఎట్టకేలకు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

PREV
16
Mouni Roy Wedding: ఘనంగా 'నాగిని' భామ మౌనీరాయ్ వివాహం.. పెళ్లిలోనే ఇబ్బంది పెట్టాడుగా, వైరల్ ఫోటోస్

బుల్లితెర సీరియల్స్ తో నటి మౌనీరాయ్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ముఖ్యంగా నాగిని టివి సిరీస్ తో మౌనీరాయ్ తిరుగులేని ఖ్యాతి సొంతం చేసుకుంది. నాజూకైన అందంతో నాగిని టివి సిరీస్ లో మౌనీరాయ్ అలరించింది. అలాగే సినిమాల్లో కూడా ఈ భామ నటించింది. కెజిఎఫ్ హిందీ వర్షన్ చిత్రంలో మౌనీరాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 

26

కొన్నిరోజులుగా మౌనీరాయ్ ప్రేమాయణం, పెళ్లి గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. వ్యాపార‌వేత్త‌ సూర‌జ్ నంబియార్‌ తో చాలా కాలంగా మౌనీ రాయ్ ప్రేమలో ఉంది. ఎట్టకేలకు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

 

36

గురువారం ఉదయం మౌనీ రాయ్, నంబియార్ వివాహ వేడుక గోవాలో వైభవంగా జరిగింది. వీరిద్దరి వివాహానికి కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. నాజూకు అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న మౌనీ రాయ్ సంప్రదాయ పెళ్లి వస్త్రధారణలో మరింత అందంగా కనిపిస్తోంది. 

46

తెల్ల పట్టు చీరలో మౌనీరాయ్ మెరిసిపోతోంది. ఇక సూరజ్ నంబియార్ గోధుమ రంగు షేర్వాణీలో కనిపిస్తున్నాడు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. వివాహానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. 

56

ఇద్దరూ చిరునవ్వులతో సంతోషంగా కనిపిస్తున్నారు. పెళ్లి జరుగుతుండగానే సూరజ్ నంబియార్.. మౌనీ రాయ్ ని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. మౌనీరాయ్ పూలమాల వేసే సమయంలో సూరజ్ మరింతగా పైకి ఎగురుతూ అందకుండా ఆటపట్టించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

66

వీరిద్దరి వివాహానికి మందిర బేడీ లాంటి సీనియర్ నటి హాజరైంది. చేతిలో చేయి వేసి మేమిద్దరం ఎట్టకేలకు ఒక్కటైనట్లు మౌనిరాయ్ సోషల్ మీడియాలో తెలిపింది. 

click me!

Recommended Stories