అంతే కాదు ఈమధ్యే నయనతార హిందీలోకి కూడా అడుగు పెట్టింది. షారఖ్ ఖాన్ తో ఆమె చేసిన జవాన్ సినిమా వెయ్యి కోట్లు పైనే సాధించి.. నయనతారను హిందీలో కూడా నిలబెట్టింది. దాంతో సీనియర్ స్టార్స్ పక్కన అక్కడ కూడా అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు మెండుగానే వస్తున్నాయి. కాని ఆమె కొన్ని కావాలని వదిలేసుకున్నట్టు సమాచారం.