చీరకే అందం తెచ్చిన యాపిల్ బ్యూటీ.. అదిరిపోయే శారీలో హన్సిక గ్లామర్ మెరుపులు.. స్టన్నింగ్ పోజులు

First Published | Apr 1, 2023, 12:21 PM IST

యాపిల్ బ్యూటీ హన్సిక మెత్వానీ పెళ్లి తర్వాత మరింతగా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లతో కట్టిపడేస్తోంది. అందంతో కుర్ర గుండెల్ని పిండేస్తోంది. తాజాగా చీరకట్టులో మైమరిపించింది.
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. తన కేరీర్ ను తెలుగు చిత్రంతోనే ప్రారంభించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సరసన ‘దేశ ముదురు’లో నటించి  ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
 

ఎన్టీఆర్, ప్రభాస్, మంచు విష్ణు, సిద్ధార్థ్ వంటి హీరోల సరసన  నటించి వెండితెరపై సందడి చేశారు హన్సిక. కొన్నేండ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఊపూపుంది. తన అందం, నటన, ఇటీవల లేడీ ఓరియెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 


ఇక హన్సిక గతేడాదే పెళ్లి పీటలు కూడా ఎక్కిందీ బ్యూటీ..2022 డిసెంబర్  4న తన స్నేహితుడు, జినెస్ మెన్ సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా హ్యాపీగా ఉంది. భర్తతో కలిసి టూర్లు, వేకేషన్లకు వెళ్తూ తెగ సందడి చేస్తోంది.  మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 
 

ఈ సందర్భంగా హన్సిక బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. గతంతో పోల్చితే హన్సిక మరింత స్లిమ్ గా తయారై మతులు పోగొడుతోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. 
 

రెడ్ శారీలో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టులో హోయలు పోయింది. స్లిమ్ ఫిట్ అందాలను ఆవిష్కరిస్తూ మైమరిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో యాపిల్ బ్యూటీ షోల్డర్ గ్లామర్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
 

చీరకట్టులో హన్సిక గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బ్యూటీఫుల్ లుక్ లో, మతిపోయే పోజులిచ్చిన హన్సిక ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యాపిల్ బ్యూటీని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక హన్సిక ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!