Krishna Mukunda Murari: అయోమయంలో కృష్ణ, గౌతమ్.. ముకుంద ద్వారా నిజం తెలుసుకొని షాకైన మురారి!

Published : Apr 10, 2023, 01:31 PM IST

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. గతంలో ఓడిపోయిన తన ప్రేమని ప్రస్తుతం గెలిపించుకోవాలని తపన పడుతున్న ఒక ప్రేమికుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Krishna Mukunda Murari:  అయోమయంలో కృష్ణ, గౌతమ్.. ముకుంద ద్వారా నిజం తెలుసుకొని షాకైన మురారి!

ఎపిసోడ్ ప్రారంభంలో వాళ్ళిద్దరూ అజ్ఞాతంలో ఉన్నారు వీలు చూసుకుని పరిచయం చేస్తాను అంటుంది కృష్ణ. మరోవైపు మంచి చెడు మాట్లాడుకోవాలంటే నా కూతురికి నయం అయ్యేదాకా మీరు కాస్త భరించాలి అంటూ వియ్యాలవారితో చెప్తుంది భవాని. నందిని కి ఈ సమస్య  మధ్యలో వచ్చింది కాబట్టి త్వరలోనే నయమైపోతుంది అనుకుంటున్నాను అంతవరకు వెయిట్ చేస్తాను అంటాడు పెళ్లి కొడుకు.

29

మీరు ఆస్తి కోసమే ఈ సంబంధానికి ఒప్పుకున్నట్లుగా పదిమంది అనుకుంటున్నారు అందుకే పెళ్లిని సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను అంటుంది భవాని. నందిని కి భాగయ్యాక ఇండియాకి తీసుకువచ్చి రిసెప్షన్ పెట్టుకుంటాను అంటాడు పెళ్లి కొడుకు. ఏర్పాట్ల గురించి మీరు పెద్దగా కంగారుపడక్కర్లేదు వచ్చే ఆదివారం మంచి ముహూర్తం అప్పటికి సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది భవాని.

39

మరోవైపు కృష్ణ వాళ్ళ దగ్గరికి వస్తాడు గౌతమ్. కూర్చోండి బావగారు అంటూ మర్యాద చేస్తాడు మురారి. పర్వాలేదు బావగారు అంటూ వేరే చైర్ తెచ్చుకుంటాడు గౌతమ్. మీ బావా, బావమరిదిల మర్యాదలు చూస్తే కృష్ణార్జునులు లాగా ఉన్నారు. ఏసిపి సర్ రథం నడిపితే గౌతమ్ సర్ యుద్ధం చేస్తారు అంటుంది కృష్ణ. ఏమంటున్నావు అంటాడు మురారి.

49

అదే సర్ మీరు పెళ్లి చేయవలసిన మేజర్స్ లో ఒక మేజర్ ఈ గౌతమ్ సర్ అంటుంది కృష్ణ. పెళ్ళికొడుకు గౌతమా అంటూ ఆశ్చర్యపోతాడు మురారి. అయినా నీకు ఏం తక్కువ మంచి పదవిలో ఉన్నావు నిన్ను వద్దనుకునే వాళ్ళు ఎవరుంటారు అంటాడు మురారి. అమ్మాయి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ అంటూ నసుకుతాడు గౌతమ్. వాళ్ల బ్యాక్ గ్రౌండ్ గురించి నీకు అనవసరం నీ బ్యాక్ గ్రౌండ్ నేను ఉన్నాను అంటూ ధైర్యం ఇస్తాడు మురారి.

59

పెళ్లికూతురు నందిని అని తెలిస్తే ఏమైపోతారో అనుకుంటుంది కృష్ణ. ఆలోచనలో ఉన్న కృష్ణని నేను ఈ పెళ్లి చేయలేనేమో అని అనుమాన పడుతున్నావా  అంటూ వెయిటర్ ని క్యాలెండర్ తీసుకురమ్మంటాడు. ఆదివారం తిధి నక్షత్రం అన్ని చాలా బాగున్నాయి ఆ రోజు ఫిక్స్ అయిపోండి అంటాడు మురారి. అంతా తొందరగా నా అంటూ షాక్ అయిపోతారు గౌతమ్, కృష్ణ. ఇక్కడ ఏసిపి అంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు.

69

మా పెద్దమ్మ నా దగ్గర ఒక మాట తీసుకుంది అందుకోసమే నేను అర్జెంటుగా వెళ్లాలి అంటూ కంగారుగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు మురారి. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటాడు గౌతమ్. నా పరిస్థితి అలాగే ఉంది అంటుంది కృష్ణ. నందిని పెళ్లి విషయం మాట్లాడుకుంటున్న భవాని వాళ్లు రేవతి రాగానే టాపిక్ మార్చేస్తారు. ఆ విషయం అర్థం చేసుకున్న రేవతి నేను ఈ ఇంటి కోడల్ని ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటుంది. ఎవరికి ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది ఆర్గ్యుమెంట్స్ వద్దు అంటుంది భవాని. 

79

నాకు అడిగే హక్కు లేదని చెప్పండి అంటుంది రేవతి. భార్య మీద కోప్పడతాడు ఈశ్వర్. అనుకున్న పని అయిన తర్వాతే చెప్తాము అంటాడు. కృష్ణ కాపురానికి ఎలాంటి ప్రమాదము లేదు కదా ఈ ఒక్కటి చెప్పండి చాలు అంటుంది రేవతి. మురారి నీకే కాదు నాకు కొడుకే వాడి కాపురం నేనెందుకు కూల్చేస్తాను అలాంటి భయాలేవీ పెట్టుకోవద్దు అంటుంది భవాని. మరోవైపు కృష్ణ చేసిన అవమానాన్ని గుర్తుచేసుకొని కోపంతో రగిలిపోతుంది ముకుంద. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు అని ముకుందని అడుగుతాడు. పెళ్లి మీ నెల రోజుల తర్వాత పెట్టుకోవటం లేదు పెళ్లి పనులు చాలా ఉన్నాయి అంటుంది ముకుంద.
 

89

నేను ఆ పనిలోనే ఉన్నాను నువ్వే డిస్టర్బ్ చేసావు అంటాడు మురారి. అత్తయ్య ఇద్దరినీ కలిపి చేయమన్నారు అంటుంది ముకుంద. పెద్దమ్మకి మన గతం తెలియదు కాబట్టి అలా అన్నది, తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతోనే నా లిమిట్స్ లో నేను ఉంటున్నాను అంటాడు మురారి. ఆదివారమే పెళ్లి అని ముకుంద ద్వారా తెలుసుకొని షాక్ అవుతాడు మురారి. నిజం చెప్పు అని నిలదీస్తాడు మురారి. ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు అంటుంది ముకుంద.

99

ఇంత తొందరగా అంటే పనులు ఎలా అవుతాయో అంటాడు మురారి. మన ఇద్దరం కలిసి చేస్తే పనులు త్వరగా నే అయిపోతాయి అంటూ కారు దగ్గరికి వెళ్తుంది ముకుంద. మురారి చేతే డోర్ ఓపెన్ చేయించుకొని ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. తరువాయి భాగంలో హాస్పిటల్ లో నువ్వు వెళ్లిన పని పూర్తయిందా పని కృష్ణని అడుగుతుంది భవాని. నేను ఎప్పుడూ వెళ్ళిన పని పూర్తి చేసుకునే వస్తాను ఇప్పుడిప్పుడే ఆపరేషన్ కూడా మొదలు పెట్టాను కచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అంటుంది కృష్ణ.

click me!

Recommended Stories