శోభన్ బాబు డబ్బు ఇవ్వకుంటే ఒప్పుకోరు.. కృష్ణ అలా కాదు, ఆయనకి పెట్టిన మారుపేరే నిజమైంది

First Published | Aug 29, 2024, 1:10 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ మరచిపోలేని దిగ్గజ నటులు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ. వీళ్ళిద్దరూ ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ఇద్దరిదీ వేర్వేరు శైలి. కృష్ణ మాస్ చిత్రాలతో దూసుకుపోయారు.

తెలుగు చిత్ర పరిశ్రమ మరచిపోలేని దిగ్గజ నటులు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ. వీళ్ళిద్దరూ ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అయితే ఇద్దరిదీ వేర్వేరు శైలి. కృష్ణ మాస్ చిత్రాలతో దూసుకుపోయారు. కౌబాయ్, జేమ్స్ బాండ్ చిత్రాలతో అనేక సాహసాలు చేశారు. కానీ శోభన్ బాబు మాత్రం ఫ్యామిలీ చిత్రాలతో అలరించారు. 

సూపర్ స్టార్ కృష్ణ, మురళి మోహన్ ఇద్దరూ క్లాస్ మేట్స్. కృష్ణ ముందు నుంచి చాలా అందంగా ఉండేవారట. కానీ క్లాస్ రూమ్ లో చాలా సైలెంట్ అని మురళి మోహన్ అన్నారు. నేను కృష్ణ ఇద్దరం ఫస్ట్ బెంచ్ లో కుర్చునేవారం. కృష్ణ ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. 


అందుకు మా ఫ్రెండ్స్ అంత కృష్ణకి సైలెంట్ గా విక్రమ్ లాగా అందంగా ఉంటాడని దేవుడు అని మారు పేరు పెట్టారు. ఆ మారుపేరే చిత్ర పరిశ్రమలోకి కృష్ణ వచ్చినప్పుడు నిజమైంది. కృష్ణ నిర్మాతల పాలిట నిజంగానే దేవుడు. ఎవరైనా నిర్మాత నష్టపోతే పిలిచి మరీ మరో సినిమా సెట్ చేసేవారు. నిర్మాత దగ్గర డబ్బు లేకపోయినా సరే ఫైనాన్షియర్స్ ని సెట్ చేసి ఆ డబ్బుకి తాను షూరిటీగా ఉండేవారు. 

లాభాలు మాత్రం నిర్మాతకి ఇచ్చేవారు. ఆ విధంగా కృష్ణ ఎంతో మంది ప్రొడ్యూసర్స్ ని ఆదుకున్నారు. రెమ్యునరేషన్ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత తీసుకునేవారు. కానీ శోభన్ బాబు మనీ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవారు. అడ్వాన్స్ ఇస్తేనే ఆయన షూటింగ్ కి వచ్చేవారట. 

ఎందుకంటే శోభన్ బాబు తన డబ్బుని భూములపై ఇన్వెస్ట్ చేసేవారు. దీనితో చాలా మందికి సమయానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చేది. షూటింగ్ లొకేషన్ కి ఒక బుక్ తెచ్చుకునేవారు. ఆ బుక్ లో చెల్లించాల్సిన డబ్బు, ల్యాండ్ వివరాలు ఉండేవి. 

నిర్మాతలు సరైన టైంకి డబ్బు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవారు. అందుకే శోభన్ బాబు డబ్బు విషయంలో కఠినంగా ఉండేవారు అని మురళి మోహన్ తెలిపారు. 

Latest Videos

click me!