KBCలో అమితాబ్ ఇప్పటి వరకు అడిగిన 5 కఠినమైన ప్రశ్నలు ..?

First Published | Aug 28, 2024, 5:57 PM IST

కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్‌ను నటుడు అమితాబ్ బచ్చన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు KBCలో అడిగిన అత్యంత కఠినమైన 5 ప్రశ్నలు  ఏంటో తెలుసా..? 
 

బుల్లితెరపై ప్రసిద్ధి చెందిన ' కోన్ బనేగా కురోర్పతి' కార్యక్రమం ద్వారా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ప్రతిభను ఈ కార్యక్రమంలో మరోసారి నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమానికి TRP రేటింగ్ ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉంది. ఇటీవలే KBC సీజన్ 16 ముగిసింది. అన్ని సీజన్లను అమితాబ్ బచ్చనే సక్సెస్ ఫుల్ గా  నిర్వహించారు.  ఇక KBC సీజన్‌లో ఇప్పటివరకు అడిగిన 5 కఠినమైన ప్రశ్నలు మీకు తెలుసా? మీరు సమాధానాలివ్వడానికి ప్రయత్నించండి. తెలియని వారు సమాధానాలను ఇక్కడ చదవండి.

KBC మొదటి సీజన్ ప్రశ్న

వీరిలో ఎవరు పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి భారత రాజ్యాంగం అనుమతిస్తుంది? ఈ ప్రశ్న KBC మొదటి సీజన్‌లో అడిగారు. దీని సరైన సమాధానం 'ఇండియన్ అటార్నీ జనరల్'.

Latest Videos


KBC 2011 సీజన్ ప్రశ్న

అక్టోబర్ 18, 1868న నికోబార్ దీవుల హక్కులను బ్రిటిష్ వారికి అమ్మడం ద్వారా ఏ వలస పాలన భారతదేశంలో తన జోక్యాన్ని ముగించింది? 2011లో జరిగిన KBC సీజన్‌లో  ఈ ప్రశ్న అడిగారు. దీని సరైన సమాధానం 'డెన్మార్క్'

KBC 12వ సీజన్ ప్రశ్న

1972లో ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య జరిగిన చారిత్రాత్మక ఇండో-పాక్ చర్చలు సిమ్లాలోని ఏ ప్రదేశంలో జరిగాయి? KBC 12వ సీజన్‌లో ఈ ప్రశ్న అడిగారు. దీని సరైన సమాధానం, 'బార్న్స్ కోర్ట్'.

KBC 13వ సీజన్ ప్రశ్న

బి.ఆర్.అంబేద్కర్ 1923లో LSEకి తన పిహెచ్‌డి కోసం ఏ పత్రాన్ని సమర్పించారు? 2021లో KBC 13వ సీజన్‌లో ఈ ప్రశ్న అడిగారు. దీని సరైన సమాధానం 'ఇండియన్ రూపీ సమస్య'

KBC 15వ సీజన్ ప్రశ్న

భారతీయ సంతతికి చెందిన లీనా గేడ్, కింది వాటిలో ఏ రేసులో గెలిచిన మొదటి మహిళా రేస్ ఇంజనీర్? KBC 15వ సీజన్‌లో ఈ ప్రశ్న అడిగారు. పోటీదారు '24 గంటల లీ మాన్స్' అని సరైన సమాధానం చెప్పి గెలవడం విశేషం.

click me!