Bigg Boss 10: నా టార్గెట్ వర్షిణి, కానీ సుధీర్ ని తొలగించింది అందుకే.. డిక్టేటర్ గా రెచ్చిపోయిన త్రిగుణ్

Published : Nov 18, 2026, 10:59 PM IST

బిగ్ బాస్ హౌస్ లో 73వ రోజు త్రిగుణ్, ముకేశ్ డిక్టేటర్స్ గా అసలైన గేమ్ మొదలు పెట్టారు. ఈ గేమ్ లో ముకేశ్ కి అడ్వాంటేజ్ లభించింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
13
బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ హౌస్ లో 73వ రోజు కీలకమైన ఘట్టం ప్రారంభం అయింది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో కంటెండర్స్ గా పాల్గొనేందుకు బిగ్ బాస్ ఒక అవకాశం కల్పించారు. త్రిగుణ్, ముకేశ్ లని డిక్టేటర్స్ గా ఎంపిక చేశారు. ఈ వారం గేమ్ లో ఎవరు పైచేయి సాధిస్తే వాళ్లకు టికెట్ టు ఫినాలే కంటెండర్స్ గా పాల్గొనే అవకాశం దక్కుతుంది అని బిగ్ బాస్ తెలిపారు.

23
డిక్టేటర్స్ గా త్రిగుణ్, ముకేశ్

త్రిగుణ్, ముకేశ్ మధ్య డిక్టేటర్స్ గేమ్ మొదలైంది. ముందుగా బిగ్ బాస్ త్రిగుణ్, ముకేశ్ మధ్య రంగు పూసుకునే గేమ్ పెట్టారు. బజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఒకరి టీ షర్ట్ పై మరొకరు రంగు పూసుకోవాలి. ఎవరి షర్ట్ పై రంగు ఎక్కువ ఉంటే వాళ్ళు ఓడిపోయినట్లు. 3 రౌండ్లలో జరిగిన ఈ టాస్క్ లో ముకేశ్ విజయం సాధించాడు. దీనితో డిక్టేటర్ గా అతడికి బిగ్ బాస్ అడ్వాంటేజ్ ఇచ్చాడు. తన ఫాలోవర్స్ ని తానే ఎంచుకునే అవకాశం కల్పించారు. ముకేశ్ మొత్తం 6 మంది ఫాలోవర్స్ ని ఎంచుకోవచ్చు. దీనితో ముకేశ్ తన టీం సభ్యులుగా వర్షిణి, రామ్ ప్రసాద్, నరేష్, అమన్, సుధీర్, ఆర్కే లని ఎంచుకున్నారు.

33
సుధీర్ ని గేమ్ నుంచి తప్పించిన త్రిగుణ్

ముకేశ్ కి ఛాయిస్ లేదు. మిగిలిన వాళ్ళు ముకేశ్ టీమ్ లో ఉంటారు. ఎవరి టీమ్ సభ్యలు వాళ్ళ డిక్టేటర్ కి గౌరవం ఇస్తూ పొగుడుతూ, ఆదేశాలు ఫాలో అవుతూ ఉండాలి. ముకేశ్ టీమ్ లో నీతూ, శివకుమార్, దేబ్జానీ, వంశీ ఉన్నారు. ఆ తర్వాత జరిగిన టాస్క్ లో త్రిగుణ్ టీం విజయం సాధించింది. దీనితో ముకేశ్ టీం నుంచి ఒకరిని తొలగించే అవకాశం త్రిగుణ్ కి దక్కింది. సంచాలకుడిగా పక్షపాతం చూపించిన సుధీర్ ని తొలగిస్తున్నట్లు త్రిగుణ్ తెలిపారు. వాస్తవానికి తాను వర్షిణిని తీసేద్దాం అని అనుకున్నానని.. కానీ సంచాలకుడిగా సుధీర్ మోసం చేయాలని చూశాడు.. అందుకే అతడిని తప్పించినట్లు త్రిగున్ పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories