ఎం.ఎస్. రాజు 'డర్టీ హరి' రివ్యూ

First Published Dec 19, 2020, 5:05 PM IST

ఏటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమా, అందులో రొమాంటిక్ స్టోరీ అంటే రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు గుర్తు వస్తాయి. అంతకు మించి వాటి నుంచి ఎక్సపెక్ట్ చేయలేనంతగా ముద్రపడిపోయింది. అయితే ఇక్కడ ఉన్నది సంక్రాంతి రాజుగా ఒకప్పుడు పేరు తెచ్చుకుని స్టార్స్ తో బ్లాక్ బస్టర్స్ తీసిన ఎమ్ ఎస్ రాజు. ఆయన డైరక్షన్ లో తీసిన సినిమా. డర్టీ సీన్స్ ఉంటాయి అని పోస్టర్స్ తో  ఓ ప్రక్క ప్రమోషన్. టైటిల్ లోనే డర్టీనెస్. అంత పెద్ద నిర్మాత,దర్శకుడు ఇప్పుడు కోరి కోరి  ఓ డర్టీ సినిమా తీసి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటాడా అనే సందేహం. జనాలని ఎట్రాక్ట్ చేసేందుకే పోస్టర్స్, ట్రైలర్స్ తో ఇలాంటి సీన్స్ తో లాక్..అబ్బే సినిమాలో ఏమి ఉండడు అనే సోషల్ మీడియా డిస్కషన్. వీటిన్నటితో కొద్దిగా బజ్ తెచ్చుకోగలిగిన ఈ సినిమా 'ఏ' తరహా జనాలకు న్యాయం చేసింది. అసలు ఈ సినిమాలో డర్టీనెస్ శాతం ఎంత...కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథేంటి... చెస్ లో టాప్ పొజీషన్ కు వెళ్లాలని హరి (శ్రవణ్ రెడ్డి) హైదరాబాద్ వస్తాడు. అక్కడ అతనితో వసుధ (రుహాని) అనే డబ్బున్న అమ్మాయి ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటుంది. కానీ ఈ లోగా హరి మనస్సు వైదేహి అన్నయ్య గర్ల్ ప్రెండ్ అయ్యిన జాస్మిన్(సిమ్రత్) వైపుకు లాగుతుంది. మోడల్, ఔత్సాహిక సినీ నటి అయిన ఆమె కూడా హరికు ఎత్తులకు చిత్తై..అతనితో అక్రమ సంభందం పెట్టుకుంటుంది. అయితే వసుధ ఆస్ది తనకు రావాలంటే ఆమె నుంచి ఈ విషయాలు దాయాలి.
undefined
మరో ప్రక్క జాస్మిన్ తనతో రిలేషన్ కంటిన్యూ అవ్వాలంటే ..వసుధ కు విడాకులు ఇచ్చేయమని పోరుతూంటుంది. మనస్సు ఆస్దివైపు, శరీరం కోరికల వైపు పోటీ పెట్టుకుంటుంది. అలాంటి డైలమో సిట్యువేషన్ లో తన సమస్యల నుంచి బయిటపడటం కోసం హరి తెగించి ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ డెసిషన్ అతని జీవితాన్ని మరిన్ని సమస్యల్లో పడేస్తుంది. ఇంతకీ హరి తీసుకున్న నిర్ణయం ఏమిటి...చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉందంటే.. అప్పుడెప్పుడో అంటే ఇరవై ఏళ్ల క్రితం Unfaithful (2002 film) అనే సినిమా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైంది. ఈ సినిమా ప్రేరణగా తీసుకుని హిందీలోనూ మర్డర్ వంటి సినిమాలు వచ్చి ఆడేసి వెళ్లిపోయాయి. తెలుగులోనే ఎవరూ ట్రై చేయలేదు. ఇన్నాళ్లకు ఎమ్ ఎస్ రాజు గారు..ఆ పని చేసారు. అయితే ఆ సినిమా అంతలా నచ్చినప్పుడు యాజటీజ్ స్క్రీన్ ప్లేతో వెళ్లిపోతే ఏ సమస్యా రాకపోను. కానీ దాన్ని Unfaithful గా ఎడాప్ట్ చేసినప్పుడే ఇలా తయారవుతుంది.
undefined
అయితే ఒరిజనల్ లో విషయం ఉంది కాబట్టి..దాని ఛాయిలు ఈ సినిమాలో కనపడుతూ ఈ సినిమాలోనూ విషయం ఉందనిపించేలా చేస్తుంది. అయితే ఆ Unfaithful సినిమా స్దాయిలో ఎంగేజ్ చేయటం కానీ , థ్రిల్ చేయటం కానీ చేయలేకపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ లో మర్డర్ మిస్టరీపైనే దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. అలా కాకుండా లస్ట్..లవ్ అంటూ సాగతీస్తూ ప్రీ క్లైమాక్స్ తో మనకు పొగబెట్టుకుంటూ వెళ్లిపోయారు డైరక్టర్.
undefined
క్లైమాక్స్ లో ఫైనల్ ట్విస్ట్ బాగుండబట్టి ఫరవాలేదనిపిస్తుంది. హరి..అక్రమ సంభందం పెట్టుకోవటానికి దారి తీసిన పరిస్దితులు..ఆ సీన్స్ నే సినిమాకు యుఎస్ పి అనుకున్నట్లున్నారు. దాంతో వాటిపైనే కాన్సర్టేట్ చేసారు. కావాలనే వసుధ పాత్రను ఫైనల్ ట్విస్ట్ కోసం సైడ్ చేసారని అర్దమైపోతుంది. ఏదైమైనా కథలో క్యారక్టర్స్ కాంప్లిక్ట్స్ ని కన్వీనింగ్ గా రైటర్ కు కావాల్సినట్లు డీల్ చేస్తే థ్రిల్లర్స్ లో థ్రిల్ రాదు.
undefined
క్యారక్టరైజేషన్ ని ఫిక్స్ చేసాక వాటి మానాన వాటిని వదిలి..ఆ జర్నీ చుట్టూ కథ అల్లితేనే సహజంగా అనిపించి అలరిస్తాయి. అదే ఇక్కడ మిస్సైంది. కాకపోతే Chekhov’s Gun థీరిని అప్లై చేస్తూ..ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ ని ఫెరఫెక్ట్ గా చేసారు. అందుకే క్లైమాక్స్ బాగుందనిపించింది. కేవలం గ్లామర్ తో గేమ్ ఆడుతూ ఓ ఎమోషనల్ మర్డర్ స్టోరీ చెప్పాలనుకున్నారు డైరక్టర్. కానీ అది స్క్రీన్ ప్లేలో అది సెట్ కాలేదు.
undefined
టెక్నికల్ గా... డైరక్టర్ గా ఎమ్ ఎస్ రాజు చేసిన ఈ బోల్డ్ ఎటెమ్ట్..కళాత్మతంగా ఉండేలా,వల్గారిటీ వైపు టర్న్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అందుకు బాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ సహకరించింది. స్టైలిష్ మేకింగ్ అనిపించేలా షాట్స్ డిజైన్ చేసారు. అలాగే మార్క్ ఎస్ రాబిన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఫెరఫెక్ట్ గా సింకైంది. జునైద్ ఎడిటింగ్ కొన్ని చోట్ల హడావిడి కనపిస్తే మరికొన్ని చోట్ల చాలా స్లోగా సాగుతుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. డైలాగులు జస్ట్ ఓకే. నటీనటుల్లో శ్రవణ్ రెడ్డి సెటిల్డ్ గా చేసారు. హీరోయిన్ రుహానీ శర్మ కూడా బాగా చేసింది. మరో అమ్మాయి సిమ్రత్ హాట్ గా కనిపించి సినిమాకు స్పైస్ అందించింది. నటన కూడా బాగా చేసింది. ఈ సినిమాలో హైలెట్ ఆమే. అలాగే సురేఖవాణి వంటి సీనియర్స్ అలవోకగా చేసుకుంటూ పోయారు.
undefined
ఫైనల్ థాట్ మరీ రామ్ గోపాల్ వర్మ రొమాంటిక్ సినిమాలా మాత్రం లేదు..అక్కడదాకా హ్యాపీ హరీ --సూర్య ప్రకాష్ జోశ్యుల Rating:2.5
undefined
నటీనటులు :శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ తదితరులు. సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్, డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి, ఎడిటర్: జునైద్ సిద్ధిఖి, సమర్పణ: గూడూరు శివరామకృష్ణ, నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి, రచన – దర్శకత్వం: ఎం.ఎస్.రాజు. విడుదల తేదీ:18-12-2020 విడుదల :ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT
undefined
click me!