స్లీవ్ లెస్ బ్లౌజ్.. డీప్ బ్యాక్ లో మృణాల్ సొగసు చూశారా.. ఇంత పద్ధతిగా ఎందుకు రెడీ అయ్యిందంటే?

First Published | Dec 4, 2023, 3:12 PM IST

క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పద్ధతిగా మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. అందచందాలను ఆకట్టుకుంటోంది. తాజాగా తన సినిమా కోసం చీరకట్టులో మరింత బ్యూటీఫుల్ గా మెరిసి ఆకట్టుకుంటోంది. అందంతో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. 

‘సీతారామం’ చిత్రంతో మరాఠి ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. దాంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘హాయ్ నాన్న’ (Hai Nanna) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూడు రోజుల్లో ఈ చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మృణాల్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటోంది. 


సినిమాకు మరింత రీచ్ తెచ్చేందుకు అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తోంది. ఈ క్రమంలో వరుసగా తన గ్లామర్ ఫొటోలను నెట్టింట పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 

తాజాగా మృణాల్ చీరకట్టులో మెరిసింది. అదిరిపోయే చీరకట్టులో అందాల విందు కూడా చేసింది. పట్టుచీరలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ స్లీవ్ లెస్ బ్లౌజ్ మతులు పోగొట్టింది. మరోవైపు డీప్ బ్యాక్ చూపిస్తూ చూపుతిప్పుకోకుండా చేసింది.

అలాగే బ్యూటీఫుల్ స్మైల్, సంప్రదాయ లుక్ తో కుర్ర హృదయాలను దోచుకుంది. ఆ మధ్యలో హాట్ హాట్ అందాలతో అదరగొట్టిన మృణాల్ ఇంత పద్ధతిగా కనిపించడం విశేషంగా మారింది. ఇటీవల చీరకట్టులోనే ఆకట్టుకుంటోంది. 

బాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం సౌత్ లో సందడి చేస్తోంది. అటు హిందీలో సినిమాలు చేస్తూనే.. తెలుగులోనూ ఆఫర్లు అందుకుంటోంది. నాని ‘హాయ్ నాన్న’తో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!