క్యాన్సర్ తో పోరాటం, నిద్రలేని రాత్రులు... జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ జీవితంలో ఇంత విషాదం ఉందా!

First Published | Mar 20, 2024, 4:21 PM IST

పైకి నవ్వుతూ నవ్విస్తూ కనిపించే కెవ్వు కార్తీక్ జీవితంలో అత్యంత విషాదం దాగి ఉంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. కెవ్వు కార్తీక్ పరిస్థితి తెలిసి అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. 
 

Kevvu Karthik


సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో కెవ్వు కార్తీక్ ఒకడు. టీమ్ సభ్యుడిగా ఎన్టీర్ ఇచ్చి లీడర్ అయ్యాడు. కెవ్వు కార్తీక్- ముక్కు అవినాష్ టీమ్ లీడర్స్ గా స్కిట్స్ చేసేవాళ్ళు. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అవినాష్ జబర్దస్త్ షో నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ మాత్రమే జబర్దస్త్ లో ఉన్నాడు. 

కెవ్వు కార్తీక్ తనదైన కామెడీ పంచెస్, బాడీ లాంగ్వేజ్ తో అలరిస్తాడు. కెవ్వు కార్తీక్ మిమిక్రి ఆర్టిస్ట్ కూడాను. హీరో నాగార్జునను చాలా బాగా ఇమిటేజ్ చేశాడు. చాలా స్కిట్స్ లో నాగార్జునను ఇమిటేట్ చేస్తూ కెవ్వు కార్తీక్ నవ్వించాడు. 
 


జబర్దస్త్ కమెడియన్ గా లక్షల మందిని నవ్వించిన కెవ్వు కార్తీక్ జీవితంలో మాత్రం విషాదం ఉంది.  ఆయన తల్లి క్యాన్సర్ తో బాధపడుతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. గత ఐదేళ్లుగా ఆమె క్యాన్సర్ తో పోరాడుతుందట. ఈ క్రమంలో ఆమెకు అనేక ఆపరేషన్స్, కీమోథెరపీ జరిగాయట.

క్యాన్సర్ మీద అలుపెరగని పోరాటం చేస్తున్న తల్లిని పోరాట యోధురాలిగా కెవ్వు కార్తీక్ అభివర్ణించాడు. అమ్మ ఆత్మస్తైర్యాన్ని కొనియాడిన కెవ్వు కార్తీక్... ఆమెకు చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపాడు. ఆసుపత్రి బెడ్ పై చికిత్స పొందుతున్న తల్లి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కెవ్వు కార్తీక్ పోస్ట్ వైరల్ అవుతుంది. 
 

గతంలో కెవ్వు కార్తీక్ తల్లి ఒక షోలో పాల్గొంది. అప్పుడు ఆమె తనకు సోకిన వ్యాధి గురించి తెలియజేశారు. కార్తీక్ కి నేను జన్మను ఇస్తే... వాడు నాకు పునర్జన్మను ఇచ్చాడని ఆమె చెప్పుకొచ్చారు. తన సంపాదన మొత్తం నా వైద్యానికి ఖర్చు చేశాడని చెప్పి ఆమె ఎమోషనల్ అయ్యింది. ఇక కెవ్వు కార్తీక్ తల్లి పరిస్థితి తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. 
 

Latest Videos

click me!