సీతారామం సీక్వెల్ సినిమా ఉంటుందా...? హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్..

Published : Apr 10, 2023, 06:44 PM ISTUpdated : Apr 10, 2023, 06:47 PM IST

సైలెంట్ గా వచ్చి ఆడియన్స్ మనసు దోచింది సీతారామం సినిమా.. మరి ఈసినిమాకు సీక్వెల్ ఉంటుందా..? ఈసినిమా సీక్వెల్ ను తెరకెక్కించబోతుననారా..? ఈ విషయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ ఏంటీ..? 

PREV
16
సీతారామం సీక్వెల్ సినిమా ఉంటుందా...? హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్..

ఒక యుద్ధంతో  రాసిన ప్రేమకథ.. సింపుల్ గా సీతారామం. ఈసినిమా సైలెంట్ గా వచ్చి.. బ్లాక్ బస్టర్ హీట్ అయ్యింది. తెలుగు మార్కెట్ లో దుల్కర్ సల్మాన్ కు మంచి డిమాండ్ ను తెచ్చిపెట్టింది. ప్లాప్ ల తో కాలం గడుపుతున్న దర్శకుడు హనూ రాఘవపూడికి సూపర్ హిట్ ను హిట్ తో ఊపిరి ఊదింది. టాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర  అద్భుత విజయాన్ని అందుకుంది.  మరీముఖ్యంగా హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను తెలుగులో నిలబెట్టింది. 

26
sita ramam hindi total box office five weeks dulquer salmaan mrunal thakur

హడావిడి లేదు.. డాన్స్ లు లేవు..  యాక్షన్ సీక్వెన్స్ లు లేవు అయినా కూడా యూత్​ ను బాగా ఆకట్టుకుంది సీతారామం సినిమా. అంతే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులు సీతారామం సినిమాని ఆదరించారు. ఈ సినిమా సీక్వెల్​ కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

36

మృణాల్ ఠాకూరు రీసెంట్ గా నటించి బాలీవుడ్ మూవీ రిలీజయ్యింది. ఈ సందర్భంగా మృణాల్ ఫ్యాన్స్​తో సరదాగా ముచ్చటించారు. ఆ సినిమాతో పాటు తాను చేస్తున్న, చేయబోతున్న ఇతర సినిమాల విశేషాలకు  కూడా అభిమానులతో  మృణాల్ ఠాకూర్  పంచుకున్నారు. ఆ చిట్​చాట్​లో సీతారామం సీక్వెల్ పార్ట్ గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. 
 

46

సీతారామం సినిమాకు సీక్వెల్   ఉంటుందా అని మృణాల్​ను ఓ ఫ్యాన్ అడిగాడు. ఈ క్వశ్చన్​కు మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ.. సీతారామం ఒక అద్భుతమైన సినిమా.. అది అందరికి తెలుసు.. కాని సీతారామం మూవీ సీక్వెల్ గురించి  ప్రస్తుతానికైతే నా దగ్గర సమాచారం లేదు. కానీ, సీతారామం సెకండ్ ఫార్ట్ కోసం అయితే నేను కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నాను అన్నారు మృణాల్.  

56

తెలుగులో ఏదైనా ఒక డైలాగ్ చెప్పాలని ఒక అభిమాని  ఆమెను కోరారు. వెంటనే అందుకున్న మృణాల్.. . అదిగో మళ్లీ మొదలు అని సీతారామం సినిమాలోని  డైలాగ్​తో మృణాల్ రిప్లై ఇచ్చారు. అంతేకాదు, సీతారామం సినిమా  షూటింగ్ టైమ్ లో దిగిన ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు. సీతారామం స ినిమా టీమ్ ను మిస్ అవుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. 

66

అయితే సీతారామం సినిమాకు  సీక్వెల్ సినిమా చేసే  ఆలోచనలో ఉన్నట్లు..  డైరెక్టర్ హనురాఘవపూడి  గతంలో  ప్రకటించారు. ఇక ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ కూడా ఈ వియంలో స్పందించడంతో.. త్వరలోనే ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కడం ఖాయం అని తెలుస్తోంది. మరి ఈ విషయాన్ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. 
 

click me!

Recommended Stories