టాలీవుడ్ సినీ ఫైనాన్సియర్‌ దారుణం, పనిమనిషిపై లైంగికదాడి

First Published Mar 7, 2021, 9:29 AM IST


సినిమావాళ్లలో కొందరు ఎంత గౌరవంగా ఉంటారో ..మరికొందరు అంత దారుణంగా బిహేవ్ చేస్తూంటారు. ముఖ్యంగా మందు,మగువ విషయాల్లో బ్యాడ్ అయ్యిపోతూంటారు. సినీ ఫైనాన్స్ లు చేసే ఓ వ్యక్తి  హైదరాబాద్ లో ఉంటూ...పనిమనుషులుగా మహిళలను పెట్టుకుని లైంగికదాడికి పాల్పడుతున్న  విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ క్రమంలో పనిమనిషిగా రాజమండ్రి నుంచి వచ్చిన ఓ వివాహితను రెండువారాలుగా ఇంట్లో బంధించి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కూతురు ఇచ్చిన సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. 
 

పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. రాజమండ్రికి చెందిన వివాహిత(45) భర్తతో విడిపోయి కూతురుతో కలిసి ఉంటోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న రవీందర్‌ అనే వ్యక్తి పని ఇప్పిస్తానంటూ చెప్పారు. దాంతో ... ఆమె గత నెల 17న రైల్లో ఇక్కడకు వచ్చింది.
undefined
ఫిలింనగర్‌ సమీపంలోని ఓ అపార్టుమెంట్‌లోని 19వ ప్లోర్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న సినీ ఫైనాన్సియర్‌, వ్యాపారి ఉదయ్‌భాను (52) ఇంట్లో పనిమనిషిగా చేరింది. అయితే పనిలో చేరిన రెండో రోజునుంచే నోటికొచ్చినట్లు అసభ్యకరమైన రీతిలో మాట్లాడటంతో పాటు ఆమెపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు.
undefined
ఆ క్రమంలో ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే.. నీతో పాటు నీ కూతురిని చంపేస్తానంటూ బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా తీసుకుని రోజూ ఆమెపై లైంగికదాడికి దిగడంతో పాటు శారీరకంగా హింసించడం ప్రారంభించాడు.
undefined
ఆమె బయటకు రాకుండా విషయం బయిటకు పొక్కకుండా గదిలో వేసి తాళం వేస్తున్నాడు. 15 రోజులుగా ఇదే రీతిలో నరకం చవిచూసిన బాధితురాలు.. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ఫోన్‌ ద్వారా ఊర్లో ఉంటున్న కూతురికి చెప్పింది.
undefined
ఆమె ఆన్‌లైన్‌లో గాలించి గోల్కొండ పోలీసులకు ఫోన్‌ చేసి తన తల్లిని ఇంట్లో బంధించారంటూ చెప్పింది. అప్రమత్తమైన పోలీసులు ఈ ప్రాంతం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుండటంతో వారికి సమాచారం ఇచ్చారు. తక్షణమే రంగంలోకి దిగిన బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో భవనంలోకి వెళ్లి ఆ మహిళను కాపాడారు.
undefined
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఉదయ్‌ భాను మీద ఐపీసీ 342, 376(2),(కే)(ఎన్‌), 323, 504, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఉదయ్‌భాను పరారవ్వడంతో అతడికోసం గాలిస్తున్నారు. గతంలో కూడా ఉదయ్‌భానుపై కొంతమంది ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.
undefined
click me!