మరొకవైపు దీప, మోనిత అన్న మాటలు తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉండగా అక్కడికి కార్తీక్ వచ్చి ఏమైంది ఎందుకంత సీరియస్ గా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు మోనిత అన్న మాటలు కార్తీక్ కి చెప్పడంతో కార్తీక్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు దీప కోపంతో రగిలిపోతూ ఆ మోనిత అంతు చూస్తాను ఈరోజు ఏదో ఒకటి తేల్చుకుంటాను అని ఆవేశంగా అక్కడికి బయలుదేరుతూ ఉండగా కార్తీక్ వద్దు దీప అనవసరంగా గొడవలు ఎందుకు అని సర్థి చెప్పినా కూడా దీప మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు మోనిత రెస్టారెంట్లు ఫుడ్డు తింటూ ఉండగా అక్కడికి సౌందర్య రావడంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.