చీరకట్టులో మౌనీ రాయ్ బ్యూటీఫుల్ లుక్.. శారీలో మైమరిపిస్తున్న ‘బ్రహ్మస్త్రం’ నటి

First Published | Oct 4, 2023, 3:36 PM IST

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ (Mouni Roy)  చీరకట్టులో మెరిసిపోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బ్యూటీఫుల్ శారీలో దర్శనమిచ్చింది. తన అందంతో ఆకర్షిస్తూ.. కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

బాలీవుడ్ టీవీ నటిగా మౌనీ రాయ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టెలివిజన్ సిరీస్ ల్లో మెరిసి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ‘నాగినీ’ సీరియల్ తో మాత్రం దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెండితెరపైకి వచ్చింది.

హిందీలో పలు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ముఖ్య పాత్రల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటిగానే కాకుండా స్పెషల్ అపీయర్స్ తోనూ వెండితెరపై  అదరగొట్టింది. తన అందంతో, డాన్స్ తో ఊర్రూతలూగించింది. 
 


ఇక మౌనీ రాయ్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. ఎప్పుడూ తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. అలాగే బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఆకట్టుకుంటుంది. 
 

తాజాగా మౌనీరాయ్ చీరకట్టులో దర్శనమిచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. మునుపెన్నడూ లేనివిధంగా అందంతో మైమరిపించింది.  బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

లేటెస్ట్ పిక్స్ లో మౌనీ రాయ్ శారీ చాలా ఆకర్షణీయంగా ఉంది. కలర్ ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండటంతో మౌనీ రాయ్ మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఫొటోలకు క్యూట్ గా ఫోజులిచ్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. అందంతో మంత్రముగ్ధులను చేసింది.
 

అటు ట్రెండీ వేర్ లోనైనా.. ట్రెడిషనల్ వేర్ లోనైనా మౌనీరాయ్ రూటే వేరు అనిపించింది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటుంటోంది. ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

Latest Videos

click me!