ట్రోలర్స్ కి విందుభోజనం ఈ ఫ్లాప్ సినిమాలు!

First Published Mar 19, 2019, 1:08 PM IST

ఏ ఇండస్ట్రీలో లేనంతగా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమిస్తారు. తమ అభిమాన హీరో హిట్ అందుకున్నాడంటే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి చేస్తుంటారు. 

ఏ ఇండస్ట్రీలో లేనంతగా తెలుగు ప్రేక్షకులు సినిమాలను ప్రేమిస్తారు. తమ అభిమాన హీరో హిట్ అందుకున్నాడంటే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి చేస్తుంటారు. అయితే స్టార్ హీరోలు నటించిన కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ లుగా మిగిలాయి. వాటిని అభిమానులు సైతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ సినిమాలేవో ఒకసారి చూద్దాం!
undefined
మహేష్ బాబు - దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన కెరీర్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి హిట్ సినిమా ఇవ్వడంతో అతడిని నమ్మి 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటించాడు మహేష్. ఈ సినిమాను కనీసం మహేష్ ఫ్యాన్స్ కూడా చూడలేకపోయారు. సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లు ఖాళీ అంటే సినిమా ఎంతగా ఫ్లాప్ అయిందో ఊహించుకోవచ్చు.
undefined
పవన్ కళ్యాణ్ - 'సర్దార్ గబ్బర్ సింగ్ కి కూడా రానన్ని ట్రోల్స్ 'అజ్ఞాతవాసి'కి వచ్చాయి. పవన్ ఫ్యాన్స్ ని బాగా డిస్టర్బ్ చేసిన సినిమా ఇది.
undefined
అల్లు అర్జున్ - 'బద్రినాథ్' సినిమాలో అల్లు అర్జున్ గెటప్ చూసి ఫ్యాన్స్ సైతం ట్రోల్ చేశారు. ఆ తరువాత అదే రేంజ్ లో 'వరుడు' సినిమాకి ట్రోల్ చేశారు.
undefined
రామ్ చరణ్ - తన కెరీర్ లో ఏ సినిమాకు రానంత నెగెటివిటీని 'వినయ విధేయ రామ' సినిమాతో చవిచూడాల్సి వచ్చింది. ఈ సినిమాను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేసి పడేశారు.
undefined
జూనియర్ ఎన్టీఆర్ - 'శక్తి' సినిమాను ఆడియన్స్ మర్చిపోయినా.. తను మర్చిపోలేనని తనపై తనే సెటైర్ వేసుకున్నాడు ఎన్టీఆర్. అంతగా తనపై ఎఫెక్ట్ చూపించిన సినిమా అది.
undefined
వెంకటేష్ - 'షాడో' 2013లో వచ్చిన చెత్త సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే.. వీక్ స్క్రిప్ట్ ఎన్నుకున్నందుకు వెంకీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేశారు.
undefined
నాగచైతన్య - 'దడ' అంటూ వచ్చి ప్రేక్షకుల్లో దడ పుట్టించాడు చైతు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా ఇదే.
undefined
ప్రభాస్ - అప్పటివరకు వరుస హిట్స్ అందుకుంటున్న ప్రభాస్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అటువంటి సమయంలో విడుదలైన 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడం, కథలో సత్తా లేకపోవడంతో ట్రోల్ చేసి పడేశారు.
undefined
బాలకృష్ణ - బాలయ్య కెరీర్ లో ట్రోల్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో ఉంటుంది 'పరమ వీర చక్ర'. రీసెంట్ గా తీసిన 'ఎన్టీఆర్' బయోపిక్ ని కూడా ట్రోల్ చేశారు.
undefined
విజయ్ దేవరకొండ - వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న విజయ్ కి 'నోటా' రూపంలో పెద్ద దెబ్బ పడింది. సోషల్ మీడియాలో ఈ సినిమాను బాగా ట్రోల్ చేశారు.
undefined
నాగార్జున - వర్మతో నాగ్ సినిమా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. కానీ నాసిరకం సినిమా తీసి విమర్శలపాలయ్యారు.
undefined
రవితేజ - టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలను సోషల్ మీడియాలో ఏకిపారేశారు.
undefined
నాని - వరుస ఫ్లాప్ ల మీదున్న నానికి 'కృష్ణార్జున యుద్ధం' రూపంలో ఫ్లాప్ వచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి కథల విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని నానిని ట్రోల్ చేశారు.
undefined
శర్వానంద్ - 'పడి పడి లేచే మనసు' సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ కామెంట్స్ బాగా వినిపించాయి.
undefined
సందీప్ కిషన్ - తమన్నాతో కలిసి సందీప్ నటించిన 'నెక్స్ట్ ఏంటి..?' సినిమాపై విడుదలకు ముందు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఆ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఫ్లాప్ అయింది. బోల్డ్ క్యారెక్టర్ లో నటించిన తమన్నాపై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి.
undefined
గోపీచంద్ - ఆక్సిజన్ సినిమా విడుదలైన తరువాత సోషల్ మీడియాలో గోపీచంద్ ని బాగా ట్రోల్ చేశారు.
undefined
click me!