Karthika Deepam: మోనితను అనుమానిస్తున్న కార్తీక్.. దీప మీద కోపంతో రగిలిపోతున్న మోనిత..?

Published : Nov 04, 2022, 09:45 AM ISTUpdated : Nov 04, 2022, 09:58 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 4వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం.  

PREV
18
Karthika Deepam: మోనితను అనుమానిస్తున్న కార్తీక్.. దీప మీద కోపంతో రగిలిపోతున్న మోనిత..?

ఈరోజు ఎపిసోడ్ లో దీప చంద్రమ్మ గురించి దుర్గ తో మాట్లాడుతూ ఆమె తన కూతురు అయితే ఎందుకు అలా టెన్షన్ పడుతోంది తప్పు చేసిన వాళ్లే కదా అలా టెన్షన్ పడేది. ఆమె ప్రవర్తన చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది దుర్గ అని అనుకుంటూ ఉంటుంది. మరి సౌర్యం అక్కడే ఉంది అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమీ లేవు కదా దీపమ్మ అనడంతో ఆధారాలు లేకనే ఇలా ఒట్టి చేతులతో వచ్చాను దుర్గ అని బాధపడుతూ ఉంటుంది దీప. వాళ్లే కాదు ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాపను చూపించాలి అంటే చూపించరు దీపమ్మ అని అంటాడు దుర్గ. ఆ తర్వాత దుర్గ దీప కోసం టీ తెచ్చి ఇస్తాడు.
 

28

అప్పుడు సౌర్య గురించి ఎక్కువగా ఆలోచించకుండా కార్తీక్ బాబు గురించి ఆలోచించు అని దీపకు ధైర్యం చెబుతూ ఉంటాడు దుర్గ. మరోవైపు కార్తీక్, మోనిత ఇద్దరు కలిసి మోనిత కారు దగ్గరికి వెళ్తారు. అప్పుడు మెకానిక్ ఏది అని కార్తీక్ అడగడంతో లేడు కార్తీక్ వచ్చి రిపేర్ చేసి వెళ్లిపోయాడు అనడంతో కారు దగ్గర మనిషి లేకుండా ఎలా రిపేర్ చేస్తారు మోనిత అని అడుగుతాడు. లేదు కార్తీక్ నేను చెప్పేది నిజం ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అనటంతో ఏమోలే మోనిత అవన్నీ ఎందుకు నువ్వు ఏది చెప్పినా నేను నమ్మాలి కదా అని అంటాడు కార్తీక్. నిజంగానే కారు చెడిపోయిందో లేకపోతే నువ్వు కావాలనే ఆటోలో వచ్చావో అంటాడు.
 

38

కార్తీక్ నీ అటు గోల ఏంటి నాకు అర్థం కావడం లేదు అంటూ మోనిత పిచ్చెక్కిన దానిలా అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మోనిత ఏమన్నా అనుకోని అనుకుని కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మోనిత కోపంతో రగిలిపోతూ కార్తీక్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని దీప దగ్గరికి వెళ్తుంది. అప్పుడు దీప నువ్వా ఏంటి ఇలా వచ్చావ్ అనటంతో నీ మీద కోపంతో రగిలి పోతున్నాను నాకు ఉన్న ఏకైక శత్రువు నువ్వే. నీ పీక పిసికి చంపేయాలి అనిపిస్తోంది అనడంతో వెంటనే దీప చావు దెబ్బ తిన్నా నీకు సిగ్గు రాలేదు అని అంటుంది. 
 

48

అప్పుడు మోనిత నీకు ఇంకా సిగ్గులేదు కార్తీక్ వెనకాల సిగ్గు లేకుండా తిరుగుతున్నావు అంటూ దీప మీద రెచ్చిపోతూ ఉంటుంది. చూడ్డానికి అమాయకురాల్లా కనిపిస్తావు నా కార్తీక్ నీ ఏం చేస్తావ్ ఇదివరకు నా మాట వినేవాడు ఇప్పుడు నామీద అనుమాన పడుతున్నాడు అని అడగగా ఈ మాటలు అన్ని నేను అనాలి నా భర్తను లాకెళ్లి అదేదో నేనే నీ భర్తను లాక్కున్నట్లు మాట్లాడుతున్నావు అని అంటుంది దీప. మోనిత కోపంతో మాట్లాడుతూ ఉండగా దీప మాత్రం కూల్ గా మాట్లాడుతూ సమాధానం చెబుతుంది.
 

58

నేను చంపాలి అనుకుంటే రెండు నిమిషాలు చాలు దుర్గ కూడా రెడీగా ఉన్నాడు ఒక్క మాట చెప్పాను అంటే మళ్ళీ చూడకుండా తరిమి తరిమి కొడతాడు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇస్తుంది దీప. మరొకవైపు చంద్రమ్మ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఇంద్రుడు వస్తాడు. అప్పుడు ఇంద్రుడు జ్వాలమ్మ వాళ్ళ నాన్న నన్ను వెంబడించాడు అనడంతో వెంటనే చంద్రమ్మ నిన్ను వాళ్ళ నాన్న వెంబడించాడు వాళ్ళ అమ్మ ఏకంగా ఇంటికి వచ్చింది అని అంటుంది. దాంతో ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
 

68

అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనడంతో ఇంద్రుడు జ్వాలమ్మ ఒప్పుకోదు అనగా చంద్రమ్మ ఒప్పించాలి ఒప్పించి తీసుకెళ్లాలి అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ, ఆనందరావు వస్తారు. మరొకవైపు చంద్రమ్మ అన్న మాటలు తలుచుకొని దీప ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దుర్గ వస్తాడు. అప్పుడు దుర్గ,దీప బాధను అర్థం చేసుకొని ఇంద్రుడు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని నాలుగు పీకి సౌర్యను వెంటబెట్టుకుని తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు.

78

అక్కడినుంచి దుర్గ వెళుతూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏం జరిగింది దుర్గ గారు అనడంతో దుర్గా జరిగింది మొత్తం వివరించగా దీపమ్మ బాధపడుతోంది ఇప్పుడు అక్కడికి వెళ్లి తేల్చుకుని వస్తాను అనడంతో కార్తీక్ ఇప్పుడు ఈ సమయంలో వద్దు రేపు నేను వంటలక్క వెళ్తాము అని చెప్పి దుర్గని వెళ్లకుండా ఆపుతాడు. అప్పుడు కార్తీక్ వంట ఏం చేశావు తొందరగా వంట చేయి ఆకలవుతుంది అని దీప నీ వంట చేయడానికి పంపిస్తాడు. మరొకవైపు మోనిత కార్తీక్ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.

88

కార్తీక్ ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చింది అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు ఆనందరావు,హిమ లు ఇంటికి రమ్మని పిలుస్తూ ఉండగా రానని చెప్పాను కదా తాతయ్య ఎందుకు నన్ను పదే పదే బలవంతం పెడతారు అని అడుగుతుంది. అప్పుడు ఆనంద్ రావు ఎంత బ్రతిమలాడినా కూడా సౌర్య కోపంగా వినిపించుకోకుండా నేను రాను మీరు వెళ్ళండి నేను అమ్మానాన్నలతో కలిసి మీ ఇంటికి వస్తాను అని అంటుంది.

click me!

Recommended Stories