డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు హైప్ విపరీతంగా పెంచడం.. కథపై ఫోకస్ పెట్టకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురవుతున్నారు.