Karthika Deepam: దీపను చంపేయడానికి ప్లాన్ వేసిన మోనిత!..కార్తీక్ కి రాజ్యలక్ష్మి సలహా!

Published : Oct 12, 2022, 07:58 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు అక్టోబర్ 12వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..  

PREV
18
Karthika Deepam: దీపను చంపేయడానికి ప్లాన్ వేసిన మోనిత!..కార్తీక్ కి రాజ్యలక్ష్మి సలహా!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దీప అక్కడున్న ఊరు వాళ్లతో కలిపి బతుకమ్మని నీళ్లలో విడిచిపెట్టడానికి నది దగ్గరికి వస్తుంది. అప్పుడు దీప వాళ్ళ అమ్మ దీపతో, నీ కష్టాలన్నీ పోయి నీకు జీవితంలో అంతా మంచే జరగాలని బతుకమ్మని వేడుకో అమ్మ అని అనగా దీప, నా జీవితానికి తిరిగి వెలుగు రావాలని దీవించు తల్లి అని బతుకమ్మ అని నీళ్లలో విడుస్తుంది. ఆ తర్వాత దీప కార్తిక్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఏమైందమ్మా అని వాళ్ళ అమ్మ అడగగా, డాక్టర్ బాబు చాలా సేపటి నుంచి కనిపించట్లేదు అమ్మ పైగా మోనిత నన్ను చంపుతాను అని బెదిరించింది దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది.అప్పుడు వాళ్ళ అమ్మ, అది ఎంత చేసినా కార్తీక్ నీ చంపదు కదా అ ధీమా మనకి ఉంది.అది మాటల వరకే గాని చేతుల వరకు చూపించదు భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది.అప్పుడు దీప,నేను వెళ్లి డాక్టర్ బాబును వెతుకుతాను అని అంటుంది.మరోవైపు మోనిత ఎవరికో ఫోన్ చేసి, డబ్బులు విషయంలో వెనకాడొద్దు నేను చెప్పిన వ్యక్తిని రాత్రి కల్లా చంపేయాలి. ఎప్పుడు,ఎక్కడికి రావాలో నేను చెప్తాను అని చెప్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత, దీప ఈరోజు రాత్రికి నీ పని అయిపోతుంది.
 

28

నీకు ఏమైంది అని కార్తీక్ అడిగితే, నీ మొగుడిని వదిలేసి కార్తీక్ వెనకాతల తిరిగావు కదా ఆడే నిన్ను చంపేసి ఉంటాడని ఇంకో కట్టుకథ అల్లుతాను. అలా జరగాలంటే నేను రోజంతా కార్తీక్ పక్కనే ఉండాలి అని కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో కావేరీ, దీప వాళ్ళ అన్నయ్య, దీప, కూడా కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో ఇంద్రుడు దీప దగ్గరికి వస్తాడు. అమ్మ మీరు ఏమనుకోకపోతే మా పాప దగ్గరికి వస్తారా అని అనగా,ఇప్పుడు నాకు వచ్చే అంత ఖాళీ లేదయ్యా నేను వెళ్ళాలి అని అంటుంది దీప.దానికి ఇంద్రుడు, ఆరోజు మీరు లిస్ట్ రాశారు కదా.అప్పుడు మా జ్వాలమ్మా  మిమ్మల్ని వెనకాతల నుంచి చూసిందట అని అటు తిరిగి మాట్లాడేసరికే దీప కార్తిక్ ని వెతికే కంగారులో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంద్రుడు ఈవిడెంటి వెళ్ళిపోయారు అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో సౌర్య, దీప కోసం వెతుకుతూ ఉండగా మోనిత కనిపిస్తుంది. నువ్వెందుకే ఇక్కడున్నావు, ఎప్పుడూ నా వెంటే తిరగడం నీకు పనా? మళ్లీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? మీ అమ్మానాన్నలు ఇక్కడ లేరు చచ్చారు అంటే వినవా మళ్ళీ వాళ్ళ కోసమే వెతకాలా!మూసుకొని హైదరాబాద్ పో అని చెప్పి కోపంగా అట్నుంచి వెళ్ళిపోతూ మనసులో,ఈరోజు రాత్రికి మీ అమ్మ చస్తాది.

38

 దాని తర్వాత కార్తీక్ ని మీ అందరికీ కనిపించుకున్న తీసుకెళ్లిపోతాను ఏ గొడవ ఉండదు అని అనుకుంటుంది.మోనిత అంత గట్టిగా మాట్లాడేసరికి శౌర్య బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంద్రుడు అక్కడికి వచ్చి, ఎవరమ్మా ఆవిడ అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. దానికి శౌర్య, మోనిత ఆంటీ గురించి చెప్పాను కదా బాబాయ్ నీకు అని చెప్తుంది. అప్పుడు ఇంద్రుడు,నేను ఆ ఆటో లో ఆవిడని కలిసానమ్మ నేను నీ గతమంతా చెప్పాను. యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాను అయినా సరే పట్టించుకోకుండా చిరాకుగా అటువైపు నుంచి వెళ్ళిపోయారు అమ్మ అని బాధపడుతూ ఉంటాడు. దానికి శౌర్య, నా గతం గురించి చెప్తే అమ్మ ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాది. అలాగే అమ్మ ఎప్పుడు కోప్పడదు. అమ్మ కాదై ఉంటుంది లే బాబాయ్ ఇంక వదిలే అని అంటాడు. మరోవైపు కార్తీక్ కి గతం లో అస్పష్టమైన చిత్రాలు గుర్తొస్తూ ఉంటాయి. మరోవైపు కావేరి కూడా కార్తీక్ కోసం వెతుకుతూ ఎక్కడా కనిపించలేదు అని మోనిత చెప్తుంది. అప్పుడు మోనిత, ఎలాగైనా కనిపెట్టాలి కావేరి ఈరోజు రాత్రికి నేను అనుకున్నది అవ్వాలంటే కార్తీక్ పక్కనే నేనుండాలి అని అంటుంది. మరోవైపు కార్తీక్ దీన పరిస్థితుల్లో, నేను ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని అనుకుంటూ ఉండగా రాజ్యలక్ష్మి అక్కడికి వస్తుంది. 

48

వచ్చి, గతం గురించి తెలియకా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నావు కదా అని అనగా, నా గురించి మీకెలా తెలుసమ్మా అని కార్తీక్ అంటాడు. దానికి రాజ్యలక్ష్మి దీప చెప్పింది అని అనగా, ఓహో దీప చెప్పిందా అయినా ఇది నా ఊరు కాదా?వీళ్ళందరూ నా మనుషులు కదా? మోనిత అంతా అబద్ధం చెప్పిందా అని అనగా, ఇది మీ ఊరు కాదు బాబు కానీ నీ మనస్సాక్షికి తెలుసు ఏది నిజమో ఏది అబద్దమో. నువ్వు  ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా నమ్ము.నాకు దీప, మోనిత ఇద్దరూ తెలియదు కానీ దీప చూపుల్లో నిస్సహాయత కనిపించింది. మోనిత చూపుల్లో మాత్రం తప్పుడు ఆలోచనలు కనిపించాయి, నేను చూపు పట్టి అంచనా వేయగాలను. ఒక స్త్రీ పెళ్లయిన తర్వాత రహస్యంగా ఇంకొకరితో ఉండగలదు కానీ బహిరంగంగా అందరి ముందు తన భర్తని వదిలేసి ఇంకొకరి భర్త కోసం చూడడు,తననీ కట్టుకున్న భార్య అయితే తప్ప. దీపని నమ్ము, దీపని మాత్రమే నమ్ము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి.ఆ తర్వాత వారణాసి అటువైపుగా వెళ్తుండగా కార్తీక్ ని చూస్తాడు. కార్తీక్ ని చూసి ఏడుస్తూ, డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా అని అంటాడు. దానికి చిరాగ్గా ఎవరయ్యా నువ్వు అని అనగా, నేను బాబు వారణాసిని గుర్తులేరా అని అంటాడు వారణాసి.
 

58

అప్పుడు కార్తీక్, ఈ ఊరు వచ్చినప్పుడు నుంచి గతం మర్చిపోయానని చెప్పి ప్రతి ఒక్కరూ నాతో ఆడుకుంటున్నారు అని చిరాగ్గా అంటాడు కార్తీక్. దానికి వారణాసి, గతం మర్చిపోయారా డాక్టర్ బాబు, నిజంగా నేను మీకు గుర్తులేదా అని అనగా నన్ను నమ్మించింది చాలు అని కార్తీక్ అరుస్తాడు. అప్పుడు వారణాసి, దీప కార్తిక్ ల పెళ్లి ఫోటో చూపిస్తాడు. అది చూసిన కార్తీక్ ఆశ్చర్యానికి గురవుతాడు. మరోవైపు శౌర్య ఆటోలో ఇంద్రుడితో కూర్చొని, ఇంక అమ్మానాన్నలు దొరకనట్టేనా బాబాయ్! ఆంటీ ఏమో తను చేతులారా దహన సంస్కారాలు చేసింది అని అన్నది కానీ నాకు ఇంకా ఎక్కడో చిన్న ఆశ ఉంది. అయినా నాతో ఎప్పుడూ అంతా గట్టిగా మాట్లాడని ఆంటీ ఈరోజు ఎందుకు అలా మాట్లాడారు అని అనగా ఇంద్రుడు, కిందటిసారి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లావు కదా అప్పుడు తన మెడలో తాళి ఉందా అని అడగగా ఏమో బాబాయ్ నేను చూడలేదు అని అంటుంది శౌర్య. 

68

దానికి ఇంద్రుడు, నువ్వు అక్కడికి వస్తే తన గుట్టు బయట పడిపోతుందని భయపడుతున్నట్టు ఉన్నారు మీకు తెలియని ఏదో రహస్యం అక్కడ జరుగుతున్నట్టు ఉన్నదమ్మ. లేకపోతే ఒకవేళ నిజంగా మీ అమ్మానాన్నలు చచ్చిపోయినా వెంటనే నిన్ను హైదరాబాద్ ఎందుకు పంపించాలనుకుంటారు?.ఆరోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లావు కదా ఇంట్లోపలికి రానిచ్చారా అని అనగా, లేదు బాబాయ్ వెంటనే కంగారుగా నువ్వు హైదరాబాదుకు వెళ్ళిపో రాత్రికి రాత్రే అని ఇంటి లోపలికి కూడా తీసుకురాలేదు, అంటే అక్కడ నిజంగా ఏదో జరుగుతుందన్నమాట.ఆంటీ నాకు తెలియకుండా ఏదో చేస్తుంది అని అనుకోని ఇప్పుడైనా అమ్మ నాన్నలు బతికే ఉన్నారు అని చిన్న ఆశ వచ్చింది బాబాయ్,అయితే అమ్మానాన్నలు కచ్చితంగా బతికే ఉండి ఉంటారు.మోనిత ఆంటీ గుట్టెంటో తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చి మంచి పనే చేసాము అని ఆనందపడతారు.
 

78

 మరోవైపు వీధి చివరన ఒక మనిషి మోనిత కి ఫోన్ చేసి, మీరు చెప్పిన వ్యక్తి ఎక్కడున్నారు నేను వెళ్తాను అని అనగా, వద్దు తనేనే అక్కడికి పంపిస్తాను చంపే అని చెప్తుంది. అప్పుడే దీప, కార్తీక్ కోసం వెతుక్కుంటూ మోనిత దగ్గరికి వస్తుంది. ఏంటి దీప, కార్తీక్ దొరకలేదా ఇందాక నుంచి వెతుకుతున్నావు అని అనగా, నువ్వు నిజం చెప్పు డాక్టర్ బాబుని నాకు దక్కకుండా ఎక్కడో దాచావు కదా బయటకు వస్తే నీ గుట్టు డాక్టర్ బాబు తెలుస్తుంది అని భయపడుతున్నావ్ కదా అని అనగా, మీ ఇంటి ముందే కాపురం పెట్టినదాన్ని, నీ కళ్ళముందే కలిసి తిరిగే వాళ్ళము నేను ఎవరి కోసం భయపడాల్సిన అవసరం లేదు.
 

88

 వెళ్లి చూసుకో అని కావాలని దీపను ఆ సందు చివరకు పంపిస్తుంది మోనిత. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ ఉండేది కార్తీక్ కాదే నీ చావు వెళ్ళు వెళ్ళు అప్పుడెప్పుడో కార్తీక్ కోసం ఒకద్దాన్ని చంపాను తర్వాత ఇంకెప్పుడూ అలా చేయకూడదు అనుకున్నాను.మళ్ళీ నువ్వే చేతులారా చేస్తున్నావు అని అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories