కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలోఓ వివాదం చెలరేగింది. చిరంజీవి ఇంటిలో జరిగిన ఓ మీటింగ్ వివాదాలకు దారితీసింది. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో కరోనా క్రైసిస్, టాలీవుడ్లో షూటింగ్స్ మరియు కార్యాచరణపైమాట్లాడానికిచిరంజీవితోపాటు నాగార్జున,రాజమౌళి,సి కళ్యాణ్, త్రివిక్రమ్, కొరటాలవంటి దర్శకులతో పాటు మరికొందరు ప్రముఖులు సమావేశం కావడం జరిగింది.
పరిశ్రమకు సంబంధించిన ఈ మీటింగ్ కి కొందరికి ఆహ్వానం అందలేదు. దీనిపైబాలకృష్ణతీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు, అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా అని విమర్శించారు. ఆ మీటింగ్ కి తనను ఎవరూ పిలవలేదని కోప్పడ్డారు. బాలయ్య వ్యాఖ్యలుపెద్ద దుమారం రేపాయి.
ఈ విషయంలోచిరంజీవి తరుపున వకాల్తా పుచ్చుకున్న నాగబాబుబాలయ్యకువార్నింగ్ ఇచ్చారు. నువ్వు పరిశ్రమలోకింగ్ వి కాదని, కేవలం ఒక హీరోవి మాత్రమే అన్నారు. నాగబాబుబాలయ్యను క్షమాపణలు చెప్పాలనిడిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంపైపరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది.
ఈ గొడవను చాలా మంది మరచిపోయారు. ఐతే విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ విషయంపై తనదైన రీతిలో స్పందించారు. ఓ ప్రముఖఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నమోహన్ బాబునుచిరంజీవి-బాలయ్య గొడవ గురించి అడుగగాడిప్లొమాటిక్ ఆన్సర్ తో తప్పుకున్నారు.
ఈ విషయంపై మోహన్ బాబు 'బాలయ్య నాకు సోదర సమానుడు, మా అన్న ఎన్టీఆర్ బిడ్డ. తనపై నాకు ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి. బాలయ్య వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయం. దానిపై నేను మాట్లాడను. ఆ మాటకొస్తే నన్ను కూడా పిలవలేదు' అన్నారు. చివరిగా ఈ టాపిక్ వదిలేద్దాం అని ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.