2020ని భారీ బ్లాక్ బస్టర్ తో మొదలుపెట్టాడుస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన అల వైకుంఠపురంలో నాన్ బాహుబలిరికార్డు సొంతం చేసుకుంది.
ఆ విజయంతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన బన్నీ, దర్శకుడు సుకుమార్ తోపాన్ ఇండియా మూవీ ప్రకటించారు. పుష్ప అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ డీగ్లామర్లుక్ లో సందడి చేయనున్నారు. ఈ క్రేజీ మూవీలో బన్నీ రాయలసీమకు చెందిన లారీ డ్రైవర్ రోల్ చేస్తున్నారు. ఆయన యాసా, వేషం అన్నీ మారిపోనున్నాయి.
దర్శకుడు సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఐదు భాషలో విడుదల కానున్నఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. లాక్ డౌన్ కి ముందుకేరళలో ఓ షెడ్యూల్ సుకుమార్ పూర్తి చేయడం జరిగింది.
ఇక బన్నీ ఈ చిత్రం కోసం బాగా జుట్టు, గడ్డం పెంచేశారు. అనుకున్న సమయానికి షూట్ మొదలుకాకపోవడంతో పెంచిన జుట్టుతోబన్నీ డిఫరెంట్ హెయిర్స్టైల్స్ట్రై చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లోఆయన అప్పీరెన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఆ మధ్య నిహారిక నిశ్చితార్ధ వేడుకలోబన్నీ లుక్ గురించి నేషనల్ లెవెల్ లో మాట్లాడుకున్నారు.
తాజాగా బన్నీ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఔటింగ్ వెళ్లారు. ఆ ఫోటోలు బయటకు రాగా బన్నీ లుక్ కూల్ గా ఉంది. ఆయన కర్లీ హెయిర్ తో సంథింగ్ డిఫరెంట్ గా అనిపిస్తున్నారు. అల్లు అర్జున్ తాజా ఫోటోలు చూసిన వారంతా స్టైలిష్ స్టార్ అనే పేరు నిలబెట్టకుంటున్నారని అంటున్నారు.