మంచు ఫ్యామిలీ మీమ్స్ విషయంలో కేసులు కూడా పెట్టారు . ఇక రీసెంట్ గా మంచు మనోజ్, విష్ణు మధ్య ఆస్తి గొడవలు, పోలీస్ కేసులు, చూస్తునే ఉన్నాం. ఇలా మంచు ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. మొదటి నుంచి మోహన్ బాబుకి కోపం ఎక్కువ అని టాలీవుడ్ అంత తెలుసు. కొన్ని విషయాలు ముఖం మీదనే చెప్పెయ్యడం, ఆవేశంతో ఊగిపోవడం, చిరంజీవితో గొడవలు ఇలా చెప్పడానికి ఆయన గురించి చాలా ఉన్నాయి.