Mohan Babu: అన్నం తినేవాడెవడూ అలా అబద్దాలు చెప్పరు..రజనీకాంత్, దాసరితో మోహన్ బాబు సాన్నిహిత్యం వెనుక రహస్యం ?

Published : Oct 20, 2026, 04:05 PM IST

మోహన్ బాబుకి రజనీకాంత్, దాసరి లాంటి వారితో మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే వీరి సాన్నిహిత్యం గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. వాటి గురించి మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.

PREV
15
Mohan Babu

సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. ఎప్పుడైనా ఒక సినిమాలో మెరుస్తున్నారు అంతే. మోహన్ బాబు చివరగా నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్ లో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇదిలా ఉండగా మోహన్ బాబు తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

25
రజనీకాంత్ కి క్లోజ్ ఫ్రెండ్

మోహన్ బాబుకి ఇండస్ట్రీలో చాలా మంది సన్నిహితులు ఉన్నారు. మోహన్ బాబు దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావుని గురువులా భావిస్తారు. మోహన్ బాబు ట్యాలెంట్ ని మొదట గుర్తించి అవకాశాలు ఇచ్చింది దాసరే కావడం విశేషం. దీనితో ముందు నుంచి వీరి మధ్య అనుబంధం ఉంది. అదే విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కి కూడా మోహన్ బాబు క్లోజ్ ఫ్రెండ్. ఇక రాజకీయ నాయకులతో కూడా మోహన్ బాబుకు టచ్ ఉంది.

35
వాళ్లకు బినామీనా ?

దివంగత నేత పరిటాల రవితో కూడా మోహన్ బాబుకు అనుబంధం ఉంది. దీనితో మోహన్ బాబుపై కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబుకి వీరి ముగ్గురి గురించి ప్రశ్న ఎదురైంది. రజనీకాంత్, దాసరి, పరిటాల రవి లకు మోహన్ బాబు బినామీ అంటూ ప్రచారం జరుగుతోంది.. ఇది నిజమా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి మోహన్ బాబు సమాధానం ఇస్తూ.. అన్నం తినేవాడెవడూ నా గురించి అలాంటి అబద్దాలు మాట్లాడరు అని మండిపడ్డారు. ఆ రూమర్స్ ని ఖండించారు.

45
నిరూపిస్తే జీవితాన్ని వదిలేస్తా

తన గురించి జరుగుతున్న మరో ప్రచారం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు కెరీర్ బిగినింగ్ నుంచి సెటిల్మెంట్స్, రౌడీయిజం చేసి ఎదిగారు అనే ప్రచారం ఉంది .. ఇందులో నిజం ఎంత అని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పారు. అలా నేను చేశాను అని ఒక్క సంఘటనతో నిరూపించినా చాలు.. నేను ఈ జీవితాన్నే వదిలేస్తాను అని మోహన్ బాబు అన్నారు.

55
అప్పులు ఎందుకు చేస్తాను ?

నేను బినామీని అయితే, సెటిల్మెంట్స్ చేస్తుంటే సినిమాల కోసం అప్పులు ఎందుకు చేస్తాను అని ప్రశ్నించారు. నా దగ్గర అంత డబ్బే ఉంటే అప్పులు చేయాల్సిన అవసరం లేదు కదా అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories