Mohan babu: ఆ పనిచేస్తే నేను రోడ్డుపై అడుక్కుతినే వాడిని.. మోహన్‌ బాబు చెప్పిన జీవిత సత్యం

Published : Sep 30, 2026, 05:46 PM IST

మోహన్‌ బాబు ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిన్నప్పుడు చదువు వదిలేసి ప్రేమ అంటూ తిరిగితే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని, అడుక్కునేవాడిని అని తెలిపారు.

PREV
13
ప్యారడైజ్‌లో విలన్‌గా మెరిసిన మోహన్‌ బాబు

కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్‌ బాబు ఇటీవల సినిమాలు తగ్గించారు. చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత ఆయన `ది ప్యారడైజ్‌` చిత్రంలో నటించారు. ఇందులో ఆయన విలన్‌ పాత్రలో మెరవడం విశేషం. మాలిక్‌ పాత్రలో అదరగొట్టారు. ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. ఇకపై మోహన్‌ బాబు విలన్‌గా బిజీ అవుతాడని చెప్పొచ్చు. అయితే మోహన్‌ బాబు ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. విలన్‌గా చేశారు, కమెడియన్‌గా చేశారు. ఆ తర్వాత హీరోగా మారారు. మధ్యలో కొన్నాళ్లు విలన్‌గా చేసి, మళ్లీ హీరోగా సక్సెస్‌ అయ్యారు. నిర్మాతగానూ సక్సెస్‌ అయ్యారు.

23
ప్రేమలో పడితే అడుక్కుతినే వాడిని- మోహన్‌ బాబు

ఇక మోహన్‌ బాబు తన ఎంబీ యూనివర్సిటీలో జరిగిన ఒక ఈవెంట్‌లో మోహన్‌ బాబు మాట్లాడారు. తాను పడ్డ కష్టాలను వెల్లడించారు. ఆ సమయంలో తనకు మీలా చదువుకునే అవకాశం లేని, డబ్బుల్లేక చదువుకోలేకపోయానని తెలిపారు. అదే సమయంలో ఆ రోజుల్లో ఇలాంటి కో ఎడ్యూకేషన్‌ కి కూడా ఛాన్స్ లేదని, ఒకవేళ ఛాన్స్ ఉంటే, చదువు పక్కన పెట్టి లవ్‌ లెటర్స్ రాసుకునేవాడిని అని తెలిపారు. ఎప్పుడూ ప్రేమ చుట్టూనే తిరిగేవాడిని. అలా చేసి ఉంటే ఇప్పుడు ఏ ఫ్లాట్‌ ఫామ్‌ పైనో అడ్డుకునేవాడిని, ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు. వచ్చింది ప్రేమించడానికి కాదు, చదువుకోవడానికి అనేది తెలుసుకోవాలి, అలా వెళ్లితే ప్రేమ ఎప్పుడైనా దొరుకుతుంది అని చెప్పారు మోహన్‌బాబు.

33
కోట్లల్లో సంపాదిస్తే, తాను సంతృప్తి చెందుతా

అప్పట్లో తాను ఎంతో కష్టపడ్డాను అని తెలిపారు. ఎలాంటి ప్లాట్‌ఫామ్‌ లేని రోజుల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చానని, ఆ తర్వాత విలన్‌గా, కమేడియన్ గా సినిమాలు చేసి పేరుతెచ్చుకున్నాడని, తర్వాత హీరోగా టర్న్ తీసుకొని సక్సెస్‌ అయ్యాను, నటుడిగా, నిర్మాతగా, ఎడ్యూకేషనలిస్ట్ గా సక్సెస్‌ అయ్యాను, అట్నుంచి రాజ్యసభ వరకు వెళ్లాను అని తెలిపారు. ఇదంతా ఊరికే రాలేదని, ఎంతో కష్టపడితేగానీ సాధ్యం కాలేదని, ప్రతి ఒక్కరు అటు ఇటు డైవర్ట్ కాకుండా కష్టపడి లక్ష్యం దిశగా వెళ్లాలని తెలిపారు మోహన్‌ బాబు. ఇప్పుడు కష్టపడితేనే భవిష్యత్‌ బాగుంటుందని, అది కాదని అమ్మాయిలు, ప్రేమ అని తిరిగితే లైఫ్‌ మరోలా ఉంటుందని చెప్పారు. తాను ఎప్పుడు సంతోషపడతానంటే.. మీరు గొప్ప స్థాయికి వెళ్లి, లక్షల్లో, కోట్లల్లో సాలరీ తీసుకునే స్థాయికి వెళితే నేను సంతోషిస్తాను, అప్పుడు సంతృప్తి చెందుతాను అని వెల్లడించారు మోహన్‌బాబు. ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories