అందమైన చిరునవ్వుతో అభిమానులను ఆకర్షించిన నటి సౌందర్య. బెంగళూరుకు చెందిన ఆమె కన్నడ కుటుంబంలో పుట్టి పెరిగింది. 1972లో జన్మించిన సౌందర్య కన్నడ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్ అవకాశాలు సాధించింది. తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా వెలుగు వెలిగింది. సౌత్ ఇండస్ట్రీని ఏలిన నటి సౌందర్య.
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె.. దక్షిణ భారత భాషలలో వెలుగు వెలిగింది. 90వ దశకంలో సౌత్ ఇండియన్ సినిమాకు స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహాన్ లాల్, వెంకటేష్, నాగార్జున, లతో పాటు శ్రీకాంత్, జగపతిబాబులాంటి స్టార్స్ తో కూడా ప్యామిలీ మూవీస్ లో నటించి మెప్పించింది.
Also Read: యంగ్ హీరోతో నిహారిక కొణిదెల పెళ్ళి, మెగా డాటర్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?