227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : May 14, 2025, 05:00 PM IST

ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  అత్యధిక ప్లాప్ సినిమాలు ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా? దాదాపు 180 డిజాస్టర్ మూవీస్ చేసిన రికార్డ్ ఏ హీరో ఖాతాలో ఉందో తెలుసా?   

PREV
17
227 ఫ్లాప్ సినిమాలు, 180 డిజాస్టర్స్ తో   రికార్డ్ క్రియేట్ చేసిన  స్టార్ హీరో ఎవరో తెలుసా?

తన కెరీర్‌లో 180 డిజాస్టర్ చిత్రాలను అందించిన ఏకైక హీరో ఎవరో తెలుసా. ఆయన ఎవరో కాదు  మిథున్ చక్రవర్తి. అన్ని ప్లాప్ సినిమాలు చేసినప్పటికీ.. స్టార్ హీరో హోదాను అందుకోవడంతో పాటు లక్షల మంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించారు మిథున్. 

27

80-90 దశకంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, రాజేష్ ఖన్నా వంటి స్టార్స్ బాలీవుడ్‌పై ఆధిపత్యం చెలాయించిన టైమ్ లో , మిథున్ చక్రవర్తి కూడా తెరపై తన ప్రతిభను చూపించారు. అయితే, ఇతర స్టార్స్‌తో పోలిస్తే ఆయన చిత్రాలు ఎక్కువగా డిజాస్టర్, ఫ్లాప్ అయ్యాయి.

37

సినిమాల్లో రాకముందు మిథున్ చక్రవర్తి నక్సలైట్. 1976లో వచ్చిన మృగ్య చిత్రంతో ఆయన నటనా జీవితాన్ని ప్రారంభించారు. తొలి చిత్రానికే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

47

మిథున్ చక్రవర్తికి ప్రారంభంలో చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు లభించాయి. ఆయన తొలి హిట్ చిత్రం 1980లో వచ్చిన హమ్ పాంచ్. ఆ తర్వాత ఆయనకు వరుసగా ప్రధాన పాత్రలు లభించాయి.

57

మిథున్ చక్రవర్తి తన కెరీర్‌లో దాదాపు 350 చిత్రాలలో నటించారు. వీటిలో 180 చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. 47 చిత్రాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయి. 2000ల ప్రారంభంలో ఆయన వరుసగా 33 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

67

మిథున్ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో తన 200  సినిమాలను తాను ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. 49 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 50 హిట్ చిత్రాలను అందించారు. వీటిలో 9 బ్లాక్‌బస్టర్‌లు, 9 సూపర్ హిట్‌లు ఉన్నాయి.

77

చిత్రాలు డిజాస్టర్, ఫ్లాప్ అయినప్పటికీ, మిథున్ చక్రవర్తి కోట్లకు అధిపతి , విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఊటీలో ఆయనకు ఒక అద్భుతమైన హోటల్ ఉంది. నివేదికల ప్రకారం, ఆయన 400 కోట్ల ఆస్తికి యజమాని.

click me!

Recommended Stories