రామ్ కార్తిక్, అంకిత్ కొయ్య, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా వంటి వారు ప్రధాన పాత్రధారులుగా `మిస్సింగ్ మేఘన` మూవీ రూపొందింది. వాచస్పతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ కాపి మూవీస్, కేడీ అండ్ కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో దర్శకుడు హీరోయిన్‌కి సంబంధించిన ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. మేఘన పాత్రలో నటించిన అమ్ము అభిరామి ప్రమోషన్స్ కి దూరంగా ఉన్న నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చారు.
దర్శకుడు మాట్లాడుతూ, `చిన్న చిన్న గొడవలు జరగడం ప్రతి సినిమా విషయంలో ఉంటుంది. మా మూవీ విషయంలో కూడా ఉన్నాయి. హీరోయిన్‌కి ఇంకా పారితోషికం పూర్తిగా ఇవ్వలేదు. దీంతో ఆమె ప్రమోషన్స్ కి దూరంగా ఉంది, అదే తప్ప మరో సమస్య కాదు అని తెలిపారు దర్శకుడు. దీనికి హీరో రియాక్ట్ అవుతూ, దర్శకుడు చెప్పింది నిజం కాదని, ఆమె వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉందని, డేట్స్ కుదరక రాలేకపోతుందని వెల్లడించారు.
చిత్ర దర్శకుడు వాచస్పతి ఇంకా మాట్లాడుతూ, `ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం కథ. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన చిత్ర బృందం అందరికీ థాంక్స్. ఈ నెల 18న విడుదల కానున్న మిస్సింగ్ మేఘన సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మిస్సింగ్ మేఘన సరికొత్తగా ఉంటుంది. ప్రారంభం నుంచి ఎంగేజ్ చేస్తుంది. సినిమాలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మాత్రమే కాదు, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, అది ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ లు, టర్న్ లు చాలానే ఉన్నాయి. థియేటర్‌లో సర్‌ప్రైజ్ అవుతారు` అని తెలిపారు.