హాఫ్ శారీలో మిర్నా మీనన్ మెరుపులు.. పద్ధతిగా మంత్రముగ్ధులను చేస్తున్న ‘జైలర్’ కోడలు

First Published | Oct 4, 2023, 2:03 PM IST

యంగ్ బ్యూటీ మిర్నా మీనన్ (Mirna Menon)  బ్యూటీపుల్  లుక్స్ తో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. ట్రెడిషనల్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

ఈ ముద్దుగుమ్మ ఇటు తెలుగులోనూ సందడి చేసింది. ఆది సాయికుమార్ సరసన ‘క్రేజీ ఫెలో’లో, అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలో నటించింది. ఉగ్రం రీసెంట్ గా వచ్చిన చిత్రమని తెలిసిందే. 
 

కానీ ఈ చిత్రాలతో ఆమెకు పెద్దగా క్రేజ్ దక్కలేదనే చెప్పాలి. వాటి ఫలితం అలా ఉండటమే కారణం. ఏదేమైనా తెలుగులో రెండు సినిమాలు నటించి ఇక్కడి ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైంది.  
 


ఇక రీసెంట్ గా కోలీవుడ్ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జైలర్’తో మంచి క్రేజ్ దక్కించుకుంది. రజినీకాంత్ కోడలి పాత్రలో అద్బుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో తెలుగులోనూ ఆఫర్లు దక్కించుకుంటోందని తెలుస్తోంది.
 

ఇప్పటికే కింగ్ నాగార్జున్ నటిస్తున్న ‘నా సామీరంగ’ చిత్రంలో మీర్నా మీనన్ కు అవకాశం దక్కిందని అంటున్నారు. ఇదే నిజమైతే ఇక ఈ ముద్దుగుమ్మ ఇక్కడ వరుస ఆఫర్లు ఖామంటున్నారు. ఈ క్రమంలో మిర్నా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తూన్నా తన అందంతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ హాఫ్ శారీలో మెరిసింది. తన అందంతో ఆకట్టుకుంది. అదిరిపోయే ఫోజులతో కట్టిపడేసింది.

తన ఫొటోషూట్లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒక మంచి లీడ్ రోల్ పడితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో కొన్నాళ్లు వెలగడం ఖామంటున్నారు.  ఆమె బ్యూటీఫుల్ లుక్ కు మంత్రముగ్ధులవుతున్నారు. లేటెస్ట్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

Latest Videos

click me!