ముంబైకి చెందిన యంగ్ బ్యూటీ దక్ష నాగర్కర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆమె హైదరాబాద్ లోనే పెరిగింది. దీంతో ఇక్కడే తెలుగులో సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
డాక్టర్ కావాల్సిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ లో అడుగుపెట్టి నటిగా మారింది. ప్రస్తుతం ఇక్కడ మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో దక్ష నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ఆమె ఫొటోషూట్లకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
దక్ష చేసే ఫొటోషూట్లు మయా హాట్ గా ఉంటాయి. ట్రెండీ వేర్ లో ఈ ముద్దుగుమ్మ ఇచ్చే స్టిల్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేసే ఏర్పడింది. అయితే దక్ష నాగర్కర్ తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. ఈ సందర్బంగా తాజాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది.
ఈ క్రమంలో అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. అయితే ఓ తుంటరి నెటిజన్ మాత్రం దక్ష థైస్ పై కామెంట్ చేశారు. ‘నాకు మీ తోడలకు పెద్ద అభిమానిని.. వాటి రహస్యం ఏంటీ?’ అంటూ ప్రశ్నించాడు.
దీంతో ఒరకంట చూసిన దక్ష మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది. నెటిజన్ పట్ల ఎలాంటి కోపం లేకుండా నవ్వుతూ ఇలా బదులిచ్చింది... ‘ఎందుకంటే నేను మసాలా వడలు తింటాను.’ అంటూ రిప్లై ఇచ్చింది. దీనిపై మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
దక్ష ఇచ్చిన ఆన్సర్ కు నెటిజన్లు, అభిమానులు షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో యంగ్ బ్యూటీ ఇంత క్లోజ్ గా ఉండటం పట్ల అభినందిస్తున్నారు. చివరిగా దక్ష రవితేజ సరసన ‘రావణసుర’ చిత్రంలో నటించింది. నెక్ట్స్ మూవీపై అప్డేట్ లేదు.