అందులో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్థానిక రచయితలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఒరిజినల్ కథలను రూపొందించనుంది. ప్రతి భాషలో అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలను అందిస్తూ, భారతీయ మైక్రో డ్రామాల రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని ఇది భావిస్తోంది. తెలుగు ఒరిజినల్ షోల కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టోరీ టీవీతో చేతులు కలిపారు. 'వన్ లాస్ట్ రైడ్' దర్శకుడు అజ్జు, నంది అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ (స్వాతి చినుకులు, ఋతురాగాలు), అలాగే చరణ్ లక్కరాజు (టెంపరరీ రూమ్‌మేట్స్), రాజ్ (బిగ్‌బాస్ తెలుగు), అన్విత (దేవయాని), విశాలాక్షి (లక్ష్మీ నివాసం), రక్ష (గుప్పెడంత మనసు), రోహిత్ (అభిషేకం), మోనిక (పద్మావతి కల్యాణం) వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు.
తెలుగు మైక్రో డ్రామాలకే ప్రయారిటీ
ఈ సందర్భంగా స్టోరీ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ GSN Aditya మాట్లాడుతూ, ఈరోజు వినోదం పూర్తిగా మొబైల్‌కే పరిమితమైంది. ప్రేక్షకులు కూడా తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. దీంతో రచయితలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు... ఇలా ఎంతో మంది సృజనాత్మక ప్రతిభకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ కథలను మరింత కొత్తగా, మరింత మందికి చేరేలా చెప్పడానికి ఇది ఒక మంచి వేది కగా మారింది. మా ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కథలకు ఉన్న ఆదరణ, సృజనాత్మక ప్రతిభ రెండూ అసాధారణమైనవి. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమమైన మైక్రో డ్రామాలను అందించడమే కాదు, ఇక్కడ నిర్మించే కథలతో దేశవ్యాప్తంగా ప్రీమియం వర్టికల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త దిశ చూపించాలని కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతున్న ఈ ప్రయాణమే రేపు దేశంలోని ఇతర భాషల్లో మా ఎదుగుదలకు బలమైన పునాది అవుతుందని మేము విశ్వసిస్తున్నాం` అని తెలిపారు. మొత్తంగా ఇది భవిష్యత్‌లో ఓటీటీలపై గట్టి ప్రభావం పడబోతుందని చెప్పొచ్చు.