ఉల్లిపొరలాంటి చాలీచాలని టాప్‌లో అసలైన ట్రీట్‌ ఇచ్చిన మెహరీన్‌.. బోల్డ్ షో ప్రీమియర్‌లో అందాల రచ్చ..

Published : Jun 28, 2023, 04:35 PM IST

ఆపిల్‌ బ్యూటీ, హాట్‌ హీరోయిన్‌ మెహరీన్‌.. సోషల్‌ మీడియాలో ఫుల్‌ బిజీగా ఉంటుంది. సినిమాల జోరు తగ్గిన ఈ బ్యూటీ ఇంటర్నెట్‌ని ఆయుధంగా మలుచుకుంటుంది. కుర్రాళ్లపై అందాల దాడి చేస్తుంది.   

PREV
17
ఉల్లిపొరలాంటి చాలీచాలని టాప్‌లో అసలైన ట్రీట్‌ ఇచ్చిన మెహరీన్‌.. బోల్డ్ షో ప్రీమియర్‌లో అందాల రచ్చ..

మెహరీన్‌ తాజాగా ఉల్లిపొరలాంటి బ్లాక్‌ టాప్‌లో మెరిసింది. చాలీచాలనీ టాప్‌లో తన టాప్‌ అందాలను ఆవిష్కరిస్తుంది. బ్లాక్‌ బ్యాంట్‌ ధరించి డెడ్లీ కాంబోలో అందాలు ఆరబోసింది. ఈ అమ్మడు ఫోటోలకు పోజులివ్వగా, అవి సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 

27

హాట్‌ హీరోయిన్‌ మెహరీన్‌ తాజాగా ముంబయిలో సందడి చేసింది. బోల్డ్ షో `లస్ట్‌ స్టోరీస్‌ 2` ప్రీమియర్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా అక్కడ సందడి చేసింది. తన ట్రెండీ వేర్‌లో ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. మిల్కీ అందాలకు, బ్లాక్‌ డ్రెస్‌ తోడు కావడంతో ఆమె హాట్‌ నెస్‌ రెట్టింపు అయ్యింది. 

37

ఈ సందర్భంగా ఆమె `లస్ట్ స్టోరీస్‌ 2` సెట్‌ వద్ద కూడా పోజులిచ్చింది. కూర్చొని మరీ అందాలు ఆరబోసింది. వంగి ఎద అందాలు చూపిస్తూ ఫోటోలకు పోజులివ్వగా ఇప్పుడు ఆయా పిక్స్ ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. 
 

47

మెహరీన్‌ రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ఫుల్‌ జోష్‌లో ఉంది. జోరుగా సినిమాలు చేసింది. కానీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. మరోవైపు వరుసగా మెహరీన్‌ సినిమాలు కూడా పరాజయం చెందాయి. దీంతో ఈ బ్యూటీకి ఛాన్స్ లు తగ్గిపోయాయి.
 

57

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `స్పార్క్` అనే తెలుగు, తమిళం బైలింగ్వల్‌ మూవీ చేస్తుంది. మరోవైపు కన్నడలో `నీ సిగూవరేగు` అనే మూవీలో యాక్ట్ చేస్తుంది. తెలుగులో ఒక్క ఆఫర్‌ కూడా లేకపోవడం గమనార్హం. 
 

67

మెహరీన్‌.. తెలుగు సినిమాలతోనే హీరోయిన్‌గా ఎదిగింది. నానితో `కృష్ణగాడి వీర ప్రేమగాథ` చిత్రంలో నటించింది. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది. ఆపిల్‌ బ్యూటీలా అందరి చూపు తనవైపు తిప్పుకుంది. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. `మహానుభావుడు`, `రాజా దిగ్రేట్‌` చిత్రాలతో వరుసగా విజయాలు అందుకుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్లు పడటంతో మెహరీన్‌ హాట్‌ కేక్‌లా మారిపోయింది. అందుకే ఈ అమ్మడికి సినిమా ఛాన్స్ లు క్యూ కట్టాయి.

77

`కేరాఫ్‌ సూర్య`, `జవాన్‌`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్‌2` సినిమాల్లో చేసింది. అన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. `ఎఫ్‌2` మాత్రం సాలిడ్‌ హిట్‌ని ఇచ్చింది. కెరీర్‌కి పెద్ద బూస్ట్ ఇచ్చింది. దీంతో మరికొన్ని ఆఫర్లు ఈ అమ్మడి తలుపు తట్టాయి. `చాణక్య`, `ఎంత మంచివాడవురా`, `అశ్వద్థామ`, `మంచి రోజులొచ్చాయ్‌`, `ఎఫ్‌3` సినిమాలు చేసింది. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్‌ చేస్తుంది. అందుకోసం గ్లామర్‌ షోకి సిద్ధపడుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories