టాలీవుడ్ యంగ్ అండ్ క్యూట్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. నయా లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. గ్లామర్ విందుతోనూ మైమరిపిస్తోంది. ఆ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది మెహ్రీన్. ‘ఎఫ్2’ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రెండీ వేర్స్ లో ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ప్రదర్శనకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ చూస్తే తిప్పుకోవడం కష్టమే. వరుస ప్రాజెక్ట్స్ తో సందడి చేస్తూ వస్తున్న హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా వాటి ప్రమోషన్స్ లో బిజీగా ఉంటోంది. ఈక్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా దర్శనమిస్తోంది.
మెహ్రీన్ తాజా లుక్ ఆకర్షణీయంగా ఉంది. లెహంగా వోణీలో దర్శనమిచ్చిన హనీ బేబీ పరువాల ప్రదర్శనతో అదరగొట్టింది. చాలీచాలనీ బ్లౌజ్ లో ఎద అందాలను విందు చేసింది. చేతులు పైకెత్తి మరీ ఘాటుగా ఫోజులిస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేసింది.
ఓ వైపు ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటూనే మరోవైపు స్కిన్ షోతోపాటు మత్తు ఫోజులతో మతులు చెడగొట్టింది. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచుతూ పోతుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట మరింత వైరల్ గా మారుస్తున్నారు.
ఇక మెహ్రీన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘స్పార్క్ లైఫ్’ రెండ్రోజుల కిందనే విడుదలైంది. కాస్తా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అంతకముందు ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ సిరీస్ తో బోల్డ్ పెర్ఫామెన్స్ చూపించి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో మెహ్రీన్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పైనా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కన్నడలో ఓ చిత్రం చేస్తోంది.