మెహరీన్ ఫిర్జాదా.. రెండేళ్ల క్రితం వరకు తెలుగులో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది. ఆమె సెకండ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ సండది చేసింది. ప్రారంభంలో మంచి విజయాలు అందుకుంది. కానీ వరుస ఫెయిల్యూర్స్ ఆమెని ఇబ్బంది పెట్టాయి. కెరీర్‌పై ప్రభావం చూపాయి. అదే సమయంలో మెహరీన్ పెళ్లికి సిద్ధమైంది. ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
దీంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఏం జరిగినా మన మంచికే అని భావించి ముందుకు సాగుతుంది. మళ్లీ నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మేకర్స్ ని తన బుట్టలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది.
ఈ క్రమంలో తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మెరిసింది మెహరీన్. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆమె వినాయక పూజలో పాల్గొంది. ఈ సందర్భంగా ట్రెడిషనల్‌గా ముస్తాబైంది. నిండుగా దుస్తులు ధరించి హోమ్లీ బ్యూటీగా మారిపోయింది. హాట్ షో చేయకపోయినా ఈ పంజాబీ బ్యూటీ టూ సెక్సీగానే ఉండటం విశేషం.
`ఎఫ్2`లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ రచ్చ చేసింది. ఇప్పుడు నయా లుక్‌లోనూ తేనెలాంటి అందాలతో పిచ్చెక్కిస్తుంది. కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెహరీన్ తన ఫ్యామిలీతో కలిసి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
మెహరీన్.. ప్రస్తుతం `స్పార్క్` అనే చిత్రంలో నటిస్తుంది. తెలుగు, తమిళంలో తెరకెక్కుతుంది. ఈ చిన్న సినిమాగా వస్తుంది. ఈ సినిమాతో తాను కమ్ బ్యాక్ కావాలనుకుంటుంది. మరి ఈ చిత్రం సక్సెస్ అవుతుందా? ఆమెకి పేరు తీసుకొస్తుందా? అనేది చూడాలి.
మెహరీన్.. నాని సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. `కృష్ణగాడి వీర ప్రేమ గాథ`లో క్యూట్ లవర్‌గా మెప్పించింది. నయా అందాలతో టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించింది. ఇండస్ట్రీలోకి కొత్త అందాలు తీసుకొచ్చి అందరిని ఆకర్షించింది. ప్రారంభంలో మంచి విజయాలు అందుకుందీ ఆపిల్ బ్యూటీ.
శర్వానంద్‌తో కలిసి నటించిన `మహానుభావుడు`, రవితేజతో నటించిన `రాజా దీ గ్రేట్` చిత్రాలు విజయాలు సాధించాయి. వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. అంతే ఆ తర్వాత వరుస పరాజయాలు ఆమెని వెంటాడాయి. `కేరాఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `నోటా`, `కవచం`.. బ్యాక్ టూ బ్యాక్ ఐదు ఫ్లాప్‌లు పడ్డాయి.
కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెని ఊపిరి పీల్చుకునేలా చేశాడు. `ఎఫ్2`తో అదిరిపోయే హిట్ అందించాడు. ఇందులో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ హనీ పాత్రలో రచ్చ చేసింది. ఇందులో ఆమె పాత్ర బాగా హైలైట్ అయ్యంది. బబ్లీగా నవ్వంచింది, అందంతో మంత్రముగ్దుల్ని చేసింది.
మళ్లీ వరుస పరాజయాలు చవిచూసింది. `చాణక్య`, `ఎంత మంచివాడవురా`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయి`, `ఎఫ్3` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. మళ్లీ ఫేడౌట్ సిచ్యూవేషన్స్ ఫేస్‌చేస్తుంది. మరి `స్పార్క్` చిత్రంతోనైనా పుంజుకుంటుందేమో చూడాలి.