నేటి యువతకి సమంత సందేశం ఇస్తూ చిన్న చిన్న విషయాలకే తన జీవితం ఇలా అయిపోయిందని ఫీల్ కావద్దని, ఇప్పుడే మీ జీవితం మొదలైందని చెప్పింది. జీవిత ప్రయాణంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పేర్కొంది. నిజానికి అలాంటి కష్టాలు, సమస్యలే మనల్ని స్ట్రాంగ్‌గా మారుస్తాయని, రాటు దేలేలా చేస్తాయని సమంత వెల్లడించింది. ఈ సందర్భంగా తన అనుభవాలు చెబుతూ, తన జీవితం ఇలా అవుతుందని 25ఏళ్లు ఉన్నప్పుడు ఊహించలేదని చెప్పింది. జీవితంలో ఇలాంటి ఇబ్బందులు పడతానని కూడా తాను అనుకోలేదని, ఏం జరిగినా పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుకు సాగాలని, అన్నీ మన మంచికే అనుకోవాలన సమంత చెప్పింది.