ఐఏఎస్ అధికారితో త్వరలో మెహ్రీన్ మాజీ ప్రియుడి పెళ్లి .. 80 గ్రామాల ప్రజలకు ఆహ్వానం, 3 నగరాల్లో రిసెప్షన్

First Published Dec 9, 2023, 5:31 PM IST

హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, బిజెపి ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ వివాహం కనుల పండుగల జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, బిజెపి ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ వివాహం కనుల పండుగల జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినీ ప్రియులు భవ్య బిష్ణోయ్ పేరుని వినే ఉంటారు. ఎందుకంటే అతడు క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ కి మాజీ ప్రియుడు. 

కొంతకాలం మెహ్రీన్ భవ్య బిష్ణోయ్ తో రిలేషన్ షిప్ కొనసాగించింది. 2021 మార్చి 12న వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కకుండానే విభేదాలతో విడిపోయారు. దీనితో అసలేం జరిగింది అంటూ అంతా షాక్ అయ్యారు. ఏది ఏమైనా బిష్ణోయ్ తో విడిపోయాక మెహ్రీన్ కెరీర్ లో మూవీ ఆన్ అయింది. 

Latest Videos


ప్రస్తుతం భవ్య బిష్ణోయ్ బిజెపి పార్టీ తరుపున అదంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తాతగారు భజన లాల్ దాదాపు 13 ఏళ్ళు హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నారు. తండ్రి కులదీప్ బిష్ణోయ్ గతంలో ఎంపీగా పనిచేశారు. 

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఈ రేంజ్ లో ఉంది కాబట్టే బిష్ణోయ్ వివాహానికి కూడా కళ్ళు చెదిరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22న భవ్య బిష్ణోయ్.. పరి బిష్ణోయ్ అనే ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగింది. 

Bhavya Bishnoi

పరి బిష్ణోయ్ రాజస్థాన్ కి చెందిన అమ్మాయి. వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. ఆ తర్వాత పుష్కర్, అదంపూర్, ఢిల్లీ నగరాల్లో మూడు రిసెప్షన్స్ జరగనున్నాయి. పెళ్లి, మూడు రిసెప్షన్స్ కి సుమారు 3 లక్షల మందిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భవ్య బిష్ణోయ్ తండ్రి అదే పనిలో ఉన్నారు. 

భవ్య బిష్ణోయ్ ఎమ్మెల్యేగా ఉన్న అదంపూర్ లో నిర్వహించే రిసెప్షన్ కి దాదాపు 80 గ్రామాల ప్రజలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. భజన్ లాల్ టైం నుంచి ఆ నియోజకవర్గంలో వీరికి మంచి పట్టు ఉంది. తన కొడుకు పెళ్లి గురించి కులదీప్ మాట్లాడుతూ.. నా పెళ్లి జరిగినప్పుడు మా నాన్న ఊరూరా తిరిగి ప్రజలని ఆహ్వానించారు. ఇప్పుడు నా కొడుకు పెళ్ళికి కూడా నేను అదే చేస్తున్నా అని కులదీప్ అన్నారు. పెళ్ళికి ఈ రేంజ్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే బడ్జెట్ కూడా ఊహకి అందని విధంగా ఉంటుంది. 

click me!