నటి మేఘనా రాజ్ తన భర్త చిరంజీవి సర్జా అకాల మరణం, కొడుకు రాయన్ జననం సమయంలో తాను అనుభవించిన బాధ, సంతోషాన్ని తెలిపారు. కొడుకు పుట్టినప్పుడు ఆమె సంచలన నిర్ణయం తీసుకుందట.
ఓ వైపు భర్త మరణం, మరోవైపు కొడుకు జననం.. మేఘనా పరిస్థితి
కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నటి, కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్, ప్రస్తుతం తన కొడుకు రాయన్ ఆలనాపాలనతో సమయం గడుపుతున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చిరంజీవి సర్జా చనిపోవడంతో, ఆ సమయంలో ఆమె పడిన వేదన మాటల్లో చెప్పలేనిది. ఒకవైపు బిడ్డ పుట్టబోతున్నాడన్న సంతోషం, మరోవైపు భర్త అకాల మరణం.. ఈ క్లిష్ట సమయంలో తాను అనుభవించిన బాధను ఆమె పంచుకున్నారు.
26
మనసులో చెప్పలేని వేదన బయటపెట్టిన మేఘనా రాజ్
Rayane Mithun అనే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేఘనా రాజ్ (Meghana Raj) ఆ సమయంలో తన మానసిక వేదన గురించి మాట్లాడారు. 'నాకు అప్పుడు సీమంతం చేసుకోవడం కూడా ఇష్టం లేదు. కానీ, ఇంట్లో వాళ్లు ఆ కార్యక్రమం చేశారు. అప్పుడు నేను పడిన బాధను ఎలా చెప్పను?' అని ఆమె ప్రశ్నించారు.
36
బిడ్డ ఎలా పడతాడో అన్న భయంతో గడిపాను
నాలోని ఆ మానసిక సంఘర్షణ, అప్పటి నా పరిస్థితిలో బిడ్డ ఎలా పుడతాడోనని చాలా భయమేసింది. తల్లి మానసిక స్థితి కడుపులో ఉన్న బిడ్డపై ప్రభావం చూపుతుంది కాబట్టి, నా బిడ్డ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పుట్టాలనే కోరిక తప్ప మరే ఆలోచనా నా లో లేదు. అలాంటి భయాలతో గడిపాను' అని ఆ బాధను గుర్తుచేసుకున్నారు.
రాయన్ పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. నాకు బాబు పుట్టినప్పుడు, బిడ్డను ఎత్తుకున్న డాక్టర్ 'అబ్బాయి పుట్టాడు.. పింక్ పింక్ బేబీ బాయ్' అని చెప్పారు. ఆ క్షణంలోనే నేను డిసైడ్ అయిపోయా. వీడికోసం బతకాలి, వీడికోసం జీవించాలి, సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకున్నా' అని మేఘనా చెప్పారు.
56
రెండో పెళ్లి గురించి మేఘనా రాజ్
ఇదే ఇంటర్వ్యూలో మేఘనా తన రెండో పెళ్లి గురించి కూడా మాట్లాడారు. 'ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలి. ఆ తోడు భర్త రూపంలోనే ఉండాలని లేదు, కానీ ఒక కంపానియన్ ఉండాలి. ఒక అబ్బాయికి అమ్మాయి తోడు అనేది నిజమే అయినా, అన్ని సందర్భాల్లోనూ అలాగే జరగాలని లేదు. కనీసం మన కష్టసుఖాలు పంచుకోవడానికైనా ఒకరు కావాలి' అని అన్నారు.
66
ఆ టైమ్ వచ్చినప్పుడు ఆలోచిస్తా.. రెండో పెళ్లిపై మేఘనా రాజ్
ఈ విషయం గురించి చాలామంది నాతో మాట్లాడతారు. మరో పెళ్లి చేసుకోమని అడుగుతారు. కానీ ప్రస్తుతం మరో ప్రేమకు నేను మానసికంగా సిద్ధంగా లేను. అలా అని చేసుకోనని చెప్పడం లేదు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే, ఆ క్షణంలో ఏం చేయాలో ఆలోచిస్తాను' అని చెబుతూ, రెండో పెళ్లిపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. రెండో పెళ్లికి రెడీ నే అనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు.