Dhanush Rejects Film: ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. వరుస లైనప్‌తో బిజీగా ఉన్న ఆయన ఓ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పాడు. ఆయన సినిమా ఆఫర్‌ని తిరస్కరించడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
ధనుష్ గతేడాది `కుబేరా` చిత్రంతో మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత `ఇడ్లీ కొట్టు`, `తేరే ఇష్క్ మెయిన్` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు అబ్దుల్ కలాం బయోపిక్, ఇళయరాజా బయోపిక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ స్టార్ డైరెక్టర్‌కి నో చెప్పారు.
26
మణిరత్నంకి నో చెప్పిన ధనుష్
కమల్ హాసన్ 'థగ్ లైఫ్' సినిమా తర్వాత మణిరత్నం తన తర్వాతి మెగా ప్రాజెక్ట్ పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో హీరోగా నటించమని ధనుష్‌ను సంప్రదించారు. మణిరత్నం చెప్పిన కథ, పాత్ర ధనుష్‌కు బాగా నచ్చాయట. కానీ, ఒక కీలక విషయంలో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరలేదు.
36
అడ్డొచ్చిన 'భారీ' రెమ్యూనరేషన్!
ఇటీవల ధనుష్ మార్కెట్ తమిళనాడుతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ పెరిగింది. దీంతో తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశాడు. అయితే, సినిమా బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని, ధనుష్ అడిగినంత పెద్ద మొత్తాన్ని ఇచ్చేందుకు మణిరత్నం టీమ్ ఒప్పుకోలేదని సమాచారం. 'మణిరత్నం సినిమాలో నటించడమే గౌరవంగా భావించే చోట, రెమ్యూనరేషన్ కోసం ఒక నేషనల్ అవార్డ్ హీరో ఛాన్స్ వదులుకోవడం కరెక్టేనా?' అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ధనుష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక, ఈ అవకాశం నటుడు శింబు (STR) వద్దకు వెళ్లింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇది కూడా సెట్ కాలేదు. చివరికి, ఈ ఛాన్స్ ఇప్పుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతిని వరించింది. ప్రస్తుతం 'పాకెట్ నావల్' సినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి, ఆ సినిమా పూర్తవగానే మణిరత్నం - లైకా కాంబోలోని ఈ కొత్త ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతాడు.
56
సాయిపల్లవి హీరోయిన్
విజయ్ సేతుపతికి జోడీగా 'నేచురల్ స్టార్' సాయి పల్లవిని తీసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ధనుష్ వదులుకున్న ఈ పాత్రలో విజయ్ సేతుపతి ఎలా మెప్పిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
66
మణిరత్నం మ్యాజిక్‌ను ధనుష్ మిస్ చేసుకున్నాడా?
మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం కంటే ధనుష్ తన రెమ్యూనరేషన్‌కే కట్టుబడి ఉండటం కోలీవుడ్‌లో ఒక చర్చకు దారితీసింది. కొందరు ఇది ప్రొఫెషనల్ నిర్ణయమని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం 'ధనుష్ ఒక మంచి మ్యాజికల్ సినిమాను మిస్ చేసుకున్నాడు' అని అభిప్రాయపడుతున్నారు.