త్వరలో ‘రావణసుర’ బ్యూటీ మేఘా ఆకాష్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ తల్లి.. ఏమన్నారంటే?

First Published | Jun 20, 2023, 4:57 PM IST

యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ (Megha Akash)  రీసెంట్ గా ‘రావణసుర’తో అలరించింది. అయితే కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోందంటూ వార్తలు వస్తుండగా.. తాజాగా ఆమె తల్లి క్లారిటీ ఇచ్చారు. 
 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ ‘లై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘ఛల్ మోహన రంగ’లోనూ నితిన్ సరసనే నటించింది ఈ సినిమాలు ఆకట్టుకోలేకపోయింది. దీంతో చెన్నైకి చెందిన ఈ భామా కొద్దికాలం తమిళంలో సందడి చేసింది. 
 

ఇటు తెలుగులోనూ వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ప్రతి అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటోంది. కానీ పెద్దగా ఫలించడం లేదు. రీసెంట్ గా మాస్ రాజా ‘రావణసుర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.  ప్రస్తుతం నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.
 


ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ వార్తలు వచ్చాయి.  తమిళనాడు కు చెందిన ఓ రాజకీయ నాయుకుడు కొడుతో పెళ్లి అంటూ గట్టిగానే రూమర్లు వచ్చాయి.  మరోవైపు ఓ బిజినెస్ మెన్ తోనూ పెళ్లి అంటూ రూమర్లు వచ్చాయి. 

దీనిపై మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ స్పందించినట్టు తెలుస్తోంది. ఆ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పిందంట. రూమర్లను స్పెండ్ చేయొద్దని కూడా సూచన చేసింది. నిజంగానే మేఘా పెళ్లి సెట్ అయ్యితే తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. 
 

ఇక రీసెంట్ గా టాలీవుడ్ డైనమిక్ హీరో శర్వానంద్ - రక్షితల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ క్రమంలో మేఘా ఆకాష్ పెళ్లిపైనా వార్తలు వచ్చాయి. తల్లి స్పందనతో రూమర్లకు అడ్డుకట్ట పడింది. 

కెరీర్ విషయానికొస్తే మేఘా ఆకాష్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో ‘మను చిత్రం’ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళంలో ‘Boo’ అనే మూవీ రూపుదిద్దుకుంటోంది.  

Latest Videos

click me!