ఆ అవార్డు గెలుచుకోవడం తనకి ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది అని తెలిపారు. అద్భుతంగా ఉన్న ఈ ఫొటోలో చిరంజీవి నూనూగు మీసాల కుర్రాడిగా గ్లాసెస్ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఆ ఫోటో కింద చిరంజీవి ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నట్లు రాసి ఉంది. అప్పట్లో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ ఇంకా చిరంజీవి గా మారలేదు. కాబట్టి అప్పటికి ఆయన పేరు శివశంకర్ వరప్రసాద్. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆ ఫోటో పై కాలేజీ యాజమాన్యం.. Mr. K. S. S. V. Prasada Rao, B.com, బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది కాలేజ్ 1974-75 అని రాసి ఉంది.