చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జోరు మామూలుగా లేదు. యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12 సోమవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే అభిమానుల హంగామా మొదలైంది.
25
ప్రీమియర్ షోల నుంచే సూపర్ హిట్ టాక్
ఈ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో మొదలయ్యాయి. ప్రీమియర్స్ షోల నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మరింతగా పెరిగాయి. యుఎస్ లో అయితే మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిరంజీవి కెరీర్ లో నార్త్ అమెరికాలో హైయెస్ట్ ప్రీమియర్స్ గ్రాసర్ గా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రికార్డు సృష్టించింది.
35
చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్
ఇంతకు ముందు ఆ రికార్డు చిరంజీవి సినిమాలలో ఖైదీ నెంబర్ 150 కి ఉంది. ఈ చిత్రం ప్రీమియర్స్ తో 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ రికార్డుని బ్రేక్ చేస్తూ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం 1.5 మిలియన్ల ప్రీమియర్ గ్రాస్ రాబట్టింది. ఇది చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్.
అధికమించి చిరంజీవి మూవీ ఈ క్రమంలో మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రీసెంట్ టాలీవుడ్ బిగ్ సినిమాలకు చుక్కలు చూపించేలా వసూళ్లు రాబడుతోంది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ కావడంతో సడెన్ గా బాలయ్య అఖండ 2 చిత్రం వార్తల్లో నిలిచింది. యుఎస్ లో అఖండ 2 చిత్రం ఫుల్ రన్ లో 1.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఈ నంబర్ ని చిరంజీవి సినిమా కేవలం ప్రీమియర్ షోల కలెక్షన్స్ తోనే బ్రేక్ చేసేసింది.
55
రాజాసాబ్ కి శంకర వరప్రసాద్ చెక్
మరో వైపు ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ కి కూడా మన శంకర వరప్రసాద్ చుక్కలు చూపిస్తోంది. ది రాజా సాబ్ చిత్రానికి ప్రీమియర్ షోల ద్వారా 1.4 మిలియన్ డాలర్లు వసూళ్లు వచ్చాయి. మన శంకర వరప్రసాద్ చిత్రం ప్రభాస్ సినిమాని అధికమించింది. మొత్తంగా ఓవర్ సీస్ లో కూడా ఈ పండక్కి చిరంజీవి హవా కనిపిస్తోంది.