చిరంజీవి కథ మార్చకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఫ్లాప్ ? మెగాస్టార్ ఏం చేశారో తెలుసా

Published : Apr 28, 2025, 06:58 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. క్లాస్, మాస్, యాక్షన్, జానపదం ఇలా చిరంజీవి అన్ని జోనర్లలో సినిమాలు చేశారు. చిరంజీవి కెరీర్లో కొన్ని చిత్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి. 

PREV
17
చిరంజీవి కథ మార్చకుంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఫ్లాప్ ? మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. క్లాస్, మాస్, యాక్షన్, జానపదం ఇలా చిరంజీవి అన్ని జోనర్లలో సినిమాలు చేశారు. చిరంజీవి కెరీర్లో కొన్ని చిత్రాలు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం గురించి. ఈ చిత్రాన్ని అందరూ అపురూపమైన దృశ్య కావ్యం అని అభివర్ణిస్తుంటారు.

27
chiranjeevi

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం టాలీవుడ్ చరిత్రలో గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. జగదేకవీరుడు అతిలోక సుందరి అనే టైటిల్ చిరంజీవి, శ్రీదేవి ఇద్దరికీ పర్ఫెక్ట్ యాప్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. ఈ చిత్ర కథ వెనుక ఎవరికీ తెలియని సంఘటన ఒకటి జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా యండమూరి వీరేంద్రనాథ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

37

కథ ప్రకారం దేవకన్య అయిన శ్రీదేవి భూమిపైకి వస్తుంది. భూమి పైకి దిగివచ్చిన దేవకన్య మొదటగా చిరంజీవిని హిమాలయాల్లో మానస సరోవరం వద్ద చూస్తుంది. కానీ రాఘవేంద్రరావు, యండమూరి ముందుగా అనుకున్న కథ ప్రకారం చిరంజీవి, శ్రీదేవి మొదట కలుసుకోవాల్సింది చంద్రమండలంలో అట. కానీ చిరంజీవి చంద్రమండలం సన్నివేశాలకు అంగీకరించలేదు అని యండమూరి అన్నారు చిరంజీవి కోరిక ప్రకారం హిమాలయాల బ్యాక్డ్రాప్ కి ఆ సన్నివేశాలు మార్చినట్లు చెప్పారు.
 

47

అసలు చంద్రమండలం సన్నివేశాలని మార్చాలని ఎందుకు అనుకున్నారు? రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకులకు అడ్డు చెప్పినప్పుడు మీరేమీ ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదా? ప్రతి సినిమాలో దర్శకులకు కథలో మార్పులు సూచిస్తుంటారా? అని యండమూరి చిరంజీవిని ప్రశ్నించారు. దీంతో చిరంజీవి నవ్వుతూ.. జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్ర కథ వెనుక జరిగిన సంఘటనలను డీటైల్డ్ గా వివరించారు.

57

చిరంజీవి మాట్లాడుతూ.. జగదేకవీరుడు అతిలోకసుందరి కథ ప్రకారం తాను పెంచుతున్న అమ్మాయికి పెద్ద గాయం అవుతుంది. ఆ అమ్మాయి పూర్తిగా కోలుకోవాలంటే వైద్యానికి డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. తాను రాకెట్ లో చంద్రమండలానికి వెళ్లి రిస్క్ చేస్తే నేను అడిగినంత డబ్బు ఇస్తారు. దీంతో హీరో చంద్రమండలానికి వెళతాడు. అక్కడ విహరిస్తున్న దేవకన్యని కలుసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ భూమ్మీదకి తిరిగి వస్తారు. ఇది ముందుగా అనుకున్న కథ. దీనికి నేను అంగీకరించలేదు.
 

67

హీరో చంద్రమండలం పైకి వెళ్లడం అనేది రియాలిటీకి దగ్గరగా లేదు. పైగా చంద్రమండలంపై రాళ్లు రప్పలు తప్ప హీరో హీరోయిన్లు కలుసుకోవడానికి ఏమీ ఉండదు. అందువల్లే తాను కథని హిమాలయాల్లోని అందమైన మానస సరోవరం నేపథ్యానికి మార్చమని రాఘవేంద్రరావుకి సూచించినట్లు చిరంజీవి తెలిపారు. నా ప్రతి చిత్రంలో కూడా మార్పులు అవసరం అయితే దర్శకుడికి సలహాలు ఇస్తుంటాను అంతే తప్ప నేను చెప్పిందే చేయాలని ఎప్పుడూ అనను అని చిరంజీవి సమాధానం ఇచ్చారు.
 

77

ఒకవేళ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రాన్ని చంద్రమండలం నేపథ్యంలో  తెరకెక్కించి ఉంటే ఇంత పెద్ద హిట్ అయ్యేదా అంటే అనుమానమే. ఎందుకంటే చిరంజీవి చెప్పినట్లు అది ప్రేక్షకులకు నమ్మదగినదిగా అనిపించదు. ఆడియన్స్ కథతో డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మొత్తంగా చిరంజీవి సూచించిన అద్భుతమైన మార్పు వల్ల జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది. 

 

Read more Photos on
click me!

Recommended Stories