సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కూల్ గా ఉంటారు అనే టాక్ ఉంది. మహేష్ బాబు ఎప్పుడూ సహనాన్ని కోల్పోవడం ఉండదు అని అంటుంటారు. షూటింగ్ సమయంలో కూడా మహేష్ బాబు చాలా ఓపిగ్గా డైరెక్టర్ నచ్చినట్లు సన్నివేశం వచ్చే వరకు చేస్తారట.
అలాంటి మహేష్ బాబు కూడా ఒక సమయంలో సహనం కోల్పోయారట. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో తెలిపారు. ఈ సంఘటన భరత్ అనే నేను చిత్ర షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది.
నేను సీరియస్ గా ప్రజలని ఆదేశించి డైలాగ్ చెబుతున్నా. కెమెరా నా ఫేస్ వైపు రోల్ అవుతోంది. కానీ ముందు వరుసలో ఉన్న ఒక మహిళా ఆర్టిస్ట్ మాత్రం సన్నివేశాన్ని అసలు పెట్టించుకోకుండా మొబైల్ లో గేమ్ ఆడుకుంటోంది.
నాకు చాలా డిస్ట్రబెన్స్ గా అనిపించింది. నేను డైలాగ్ చెబుతూ చెబుతూ కట్ కూడా చెప్పకుండా.. అమ్మా కొంచెం ఆ గేమ్స్ ఆపమ్మా.. మొబైల్ పక్కన పెట్టు అని చెప్పా అంటూ బాలయ్యతో అన్నారు.
అదే మీరు కానీ అక్కడ ఉండి ఉంటే మైక్ విసిరి కొట్టేవారు అంటూ మహేష్ బాబు ఫన్నీగా బాలయ్యని ఉద్దేశించి అన్నారు. బాలయ్య వెంటనే నవ్వేశారు. గతంలో చాలా సందర్భాల్లో బాలయ్య పబ్లిక్ లో తన కోపాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే.
భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీ గా నిలిచిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మహేష్ సీఎం గా నటించారు.