కామెడీ హీరో చేయాల్సిన మూవీ అంటూ చిరంజీవి కామెంట్స్, కట్ చేస్తే ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ అదే

Published : Apr 26, 2025, 05:18 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్షన్ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ కథలు, అడ్వెంచర్ మూవీలు కూడా ఎంచుకున్నారు.ఖైదీ కంటే ముందుగానే చిరంజీవి నటించిన ఒక చిత్రం గోల్డెన్ జూబ్లీగా నిలిచింది.

PREV
15
కామెడీ హీరో చేయాల్సిన మూవీ అంటూ చిరంజీవి కామెంట్స్, కట్ చేస్తే ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ అదే
megastar chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్షన్ సినిమాలు చేస్తూనే ఫ్యామిలీ కథలు, అడ్వెంచర్ మూవీలు కూడా ఎంచుకున్నారు. వైవిధ్యం ఉన్న కథలు చిరంజీవికి నటుడిగా గుర్తింపు పెంచుతూ వచ్చాయి. చిరంజీవి కెరీర్ ని మార్చేసిన చిత్రం ఖైదీ. కానీ ఖైదీ కంటే ముందుగా చిరంజీవి చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. చిరంజీవిని తిరుగులేని హీరోగా నిలబెట్టింది మాత్రం ఖైదీ అనే చెప్పాలి. 

 

25

ఖైదీ కంటే ముందుగానే చిరంజీవి నటించిన ఒక చిత్రం గోల్డెన్ జూబ్లీగా నిలిచింది. అది కూడా కామెడీ టచ్ ఉండే ఫ్యామిలీ కథా చిత్రం. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య.  క్రేజీ డైరెక్టర్ కోడి రామకృష్ణకి ఇదే డెబ్యూ మూవీ. కె రాఘవ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో హీరోగా చిరంజీవిని తీసుకోవాలని కోడి రామకృష్ణ కథ రాసుకున్నప్పుడే అనుకున్నారు. అదే విషయాన్ని నిర్మాతకి చెప్పారు. 

 

35

అప్పటికే చిరంజీవి యాక్షన్ హీరోగా కొంత గుర్తింపు ఉంది. దీనితో నిర్మాత రాఘవ.. ఇది ఫ్యామిలీ అండ్ కామెడీ కథ. యాక్షన్ సినిమాలు చేసే చిరంజీవి దీనికి ఒప్పుకుంటాడా అని అడిగారు. తాను ఒప్పిస్తానని కోడి రామకృష్ణ చిరంజీవి వద్దకి వెళ్లారు. కథ విన్న వెంటనే చిరంజీవి ఇది నేను చేయాల్సిన కథ కాదు. ఎవరైనా కామెడీ హీరో చేస్తే బావుంటుంది అని చెప్పారు. 

 

45

అప్పుడు కోడి రామకృష్ణ.. సార్ ఈ చిత్రంతో మీ ఇమేజ్ కి ఎలాంటి డోకా లేదు. మీరు చేస్తే ఈ కథ రేంజ్ పెరుగుతుంది అని చెప్పారు. దీనితో చిరంజీవికి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ కొత్త దర్శకుడిని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో అంగీకరించారు. నటుడిగా గొల్లపూడి మారుతీరావుకి కూడా ఇదే తొలి చిత్రం. ఈ మూవీలో ఆయన నెగిటివ్ రోల్ లో నటించారు. మాధవి, పూర్ణిమ హీరోయిన్లుగా నటించారు. 

 

55
Chiranjeevi

తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ చిత్రం చిరంజీవికి ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ హిట్ గా నిలిచి 50 వారాలు రన్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో చిరంజీవి ఇమేజ్ ని పెంచడమే కాక.. కోడి రామకృష్ణ లాంటి దర్శకుడిని. మారుతీ రావు లాంటి నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. 

 

Read more Photos on
click me!

Recommended Stories