ఫ్లైట్ లో చిరంజీవి, సురేఖ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్..పక్కనే మెగాస్టార్ బెస్ట్ ఫ్రెండ్

Published : Feb 20, 2025, 04:40 PM IST

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల దంపతులు ఫిబ్రవరి 20 న తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

PREV
14
ఫ్లైట్ లో చిరంజీవి, సురేఖ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్..పక్కనే మెగాస్టార్ బెస్ట్ ఫ్రెండ్
Chiranjeevi, Surekha

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల దంపతులు ఫిబ్రవరి 20 న తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి రోజు తన భార్యతో దుబాయ్ వెకేషన్ కి మెగాస్టార్ బయలుదేరారు. 

 

24
Megastar Chiranjeevi

ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే చిరంజీవి బయలుదేరిన ప్రైవేట్ జెట్ లోనే నాగార్జున అమల దంపతులు కూడా ఉన్నారు. అంతే కాలేదు మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా ఉన్నారు. వీరంతా దుబాయ్ కి పయనమయ్యారు. 

 

34
megastar chiranjeevi

వీరందరి మధ్య ఫ్లైట్ లోనే చిరంజీవి, సురేఖ వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ దృశ్యాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దుబాయ్ కి ప్రయాణిస్తూ తన క్లోజ్ ఫ్రెండ్స్ తో వెడ్డింగ్ యానివర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నట్లు చిరంజీవి తెలిపారు. 

 

44
megastar chiranjeevi

ఈ సందర్భంగా తన భార్య సురేఖపై ప్రశంసలు కురిపించారు. సురేఖ నా జీవితంలోకి వచ్చినందుకు నేను ఎప్పుడూ అదృష్టవంతుడిగా ఫీల్ అవుతుంటాను. ఆమె నా బలం, నను నడిపించే శక్తి. ఆమె మాటలు జీవితంలో ముందుకు వెళ్లడానికి నాకు ప్రోత్సాహంగా అనిపిస్తాయి. థాంక్యూ సోల్ మేట్ అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. ఇక ఇండస్ట్రీలో చిరంజీవి నాగార్జున బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories