నా వల్ల తమ్ముడు నష్టపోయాడు, ఇన్నేళ్ల తర్వాత బయట పెట్టిన చిరంజీవి.. ముచ్చటపడి సైరా మూవీ చేస్తే..

First Published Apr 14, 2024, 3:15 PM IST

నేను కోరుకునే పాత్రలు ప్రతిసారి రావు. వాటంతట అవే రావాలి అని చిరంజీవి అన్నారు. నాకు స్వాతంత్ర సమరయోధుడిగా నటించాలని కోరిక. ఆ కోరిక సైరా చిత్రంతో తీరింది. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో 200 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి రీసెంట్ గా ప్రముఖ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Chiraneevi

ఈ చర్చా కార్యక్రమంలో చిరంజీవి మనసు విప్పి అన్ని విషయాలని మాట్లాడారు. తన కెరీర్ లో దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు కూడా పంచుకున్నారు. కమర్షియల్ సినిమా, నిర్మాతల కష్టాల గురించి చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

నిర్మాతల బాగోగులు దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కాక తప్పదని చిరంజీవి అన్నారు. వ్యక్తిగతంగా వైవిధ్యమైన చిత్రాలు చేయాలని ఉంటుంది. కానీ కమర్షియల్ గా అవి వర్కౌట్ కావు. నిర్మాతలు నష్టపోకుండా ఉండేందుకు కమర్షియల్ చిత్రాలు ఎక్కువ చేస్తున్నట్లు చిరు అన్నారు. 

నేను కోరుకునే పాత్రలు ప్రతిసారి రావు. వాటంతట అవే రావాలి అని చిరంజీవి అన్నారు. నాకు స్వాతంత్ర సమరయోధుడిగా నటించాలని కోరిక. ఆ కోరిక సైరా చిత్రంతో తీరింది. రాంచరణ్ ఖర్చులో రాజీ పడకుండా 200 కోట్లతో ఆ చిత్రాన్ని నిర్మించాడు. కానీ ఆ మూవీతో మాకు నష్టాలు తప్పలేదు అని చిరంజీవి అన్నారు. సైరా చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికి భారీ బడ్జెట్ కావడంతో అది సరిపలేదు. 

chiranjeevi

అదే విధంగా చిరు రుద్రవీణ చిత్రాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. రుద్రవీణ చాలా గొప్ప సినిమా. మంచి పేరొచ్చింది. కానీ ఆ చిత్రాన్ని నిర్మించిన నా తమ్ముడు నాగబాబుకు నష్టాలు తప్పలేదు అని చిరంజీవి అన్నారు. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే జేబు ఖాళీ అవుతుంది. 

అందుకే నిర్మాతల బాగు కోసం కమర్షియల్ చిత్రాల వైపు అడుగులు వేశాను అని చిరు తెలిపారు. నాగబాబుకు నిర్మాతగా అంతగా కలసి రాలేదు. నాగబాబు నిర్మాతగా రుద్రవీణ, త్రినేత్రుడు, బావగారు బావున్నారా, గుడుంబా శంకర్, ఆరెంజ్, స్టాలిన్ లాంటి చిత్రాలు నిర్మించారు. 

click me!