కార్ రేసర్లకి అజిత్‌ షాక్‌, రీఎంట్రీ ఇస్తూ ఊహించని ట్విస్ట్

First Published | Jan 12, 2025, 6:25 AM IST

కార్ రేసింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నటుడు అజిత్,  రేసర్లకి షాకిచ్చాడు. ఆయన మళ్లీ రీఎంట్రి ఇచ్చినట్టు తెలుస్తుంది. 
 

అజిత్ కార్ రేసింగ్ లేటెస్ట్ అప్డేట్

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్ రేసింగ్ కోసం 9 నెలలు సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పారు.  దుబాయ్‌లో జరగబోయే 24హెచ్‌ కార్ రేస్‌లో పాల్గొనబోవట్లేదని ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్ళీ కార్ రేస్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.
 

అజిత్ 24h దుబాయ్ 2025లో పాల్గొంటున్నారు

 అజిత్ గతంలో 2003  ఫార్ములా ఆసియా BMW ఛాంపియన్‌షిప్, 2019 ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నారు. ఆ తర్వాత సినిమాలతో బిజీ అయ్యారు. ఇప్పుడు 'రేసింగ్' టీమ్ లీడర్‌గా 24 హెచ్ రేస్ కోసం శిక్షణ తీసుకుంటున్నారు.
 


అజిత్ రేస్ కారు ప్రమాదం

రెండు రోజుల క్రితం టెస్ట్ డ్రైవ్‌లో అజిత్ కారు గోడను ఢీకొట్టింది. అజిత్‌కి ఏమీ కాలేదు. మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
 

అజిత్ ప్రకటన

కొన్ని గంటల క్రితం అజిత్ 24హెచ్‌ కార్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అజిత్ ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు మళ్ళీ రేస్‌లో పాల్గొంటున్నారు. 24 గంటలు కాకుండా తక్కువ సమయం డ్రైవ్ చేయొచ్చు. అజిత్ రేస్ చేస్తున్న వీడియో బయటకొచ్చింది. అజిత్ టీమ్ ఐరోపియన్ 24h, పోర్స్చే 992 GT3 రేసుల్లో కూడా పాల్గొంటుందట.

ఇక సినిమాల పరంగా అజిత్ `విడముయార్చి`, `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` ఏప్రిల్‌ 10న విడుదల కాబోతుంది. 

read more: `గేమ్ ఛేంజర్` నా లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌, సముద్రఖని మనసులో మాట

also read: విజయ్‌ 69 `భగవంత్ కేసరి` రీమేక్, అనిల్ రావిపూడికి షాకిచ్చిన కమెడియన్, దళపతికి ఎందుకు నో చెప్పాడు?

Latest Videos

click me!